Hyderabad Rains | హైదరాబాద్ లో మారిన వాతావరణం..పలుచోట్ల వర్షాలు

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం వరకు మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 25, 2026, 4:03 pm IST
Read Time: 2 mins
Hyderabad Rains | హైదరాబాద్ లో మారిన వాతావరణం..పలుచోట్ల వర్షాలు

విధాత, హైదరాబాద్ : అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో దట్టంగా కారు మబ్బులు అలుముకోవడంతో .. నగరంలోని పలుచోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. అయితే నగరంలో నలువైపుల ఒక్కో చోట ఒక్కో మోతాదులో వర్షం పడే పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా, కొన్ని చోట్ల ఈదురుగాలులు కూడా వీచాయి.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో వాతావారణం కొద్దిసేపు ఎండలు..మరికొద్ది సేపు చల్లని గాలులు, మేఘావృతమైన ఆకాశంతో మారుతూ వస్తుంది. ఈ రోజు సాయంత్రం మరింతగా వర్షపు జల్లులు పడవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Odisha Mining Officer : ఒడిస్సా విజిలెన్స్ వలకు అతిపెద్ద అవినీతి తిమింగలం!
Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య