రాఘ‌వ లారెన్స్‌కి భ‌యంక‌ర‌మైన వ్యాధి.. అందుకే అలా చేస్తున్నాడా..!

రాఘ‌వ లారెన్స్‌కి భ‌యంక‌ర‌మైన వ్యాధి.. అందుకే అలా చేస్తున్నాడా..!

రాఘ‌వ లారెన్స్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళ‌నాడుకి చెందిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు. కేవలం నటుడు గానే కాకుండా కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా అల‌రిస్తున్నాడు. లారెన్స్ మొట్టమొదటిసారిగా కొరియోగ్రాఫర్ గానే ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగాను నటుడిగాను ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. లారెన్స్‌ని సినీ ప్ర‌ముఖుడిగా కాకుండా మంచి మ‌న‌సున్న మ‌నిషిగా అంద‌రు ఇష్ట‌ప‌డ‌తారు. తన ట్రస్టు ద్వారా ఎంతో మందికి సేవ చేసి అంద‌రి అభిమానాన్ని చూర‌గొన్నాడు లారెన్స్. తన సంపాదనలో ఎక్కువగా సామాజిక సేవ కార్యక్రమాలకే కేటాయించే లారెన్స్ ఇప్ప‌టికే చాలా మందికి గుండె ఆప‌రేష‌న్స్ చేయించాడు.

తెలివి ఉండి.. ఆర్ధిక స్థోమత లేక చ‌దువుకోలేని వారికి కూడా బంగారు బాట‌లు వేశాడు లారెన్స్. స‌మాజసేవ‌కి విలువైన స‌మ‌యం కేటాయించే లారెన్స్ చిన్న‌ప్పుడు ప్రాణాంత‌క వ్యాధి నుండి బ‌య‌ట‌పడ్డార‌ట‌. లారెన్స్ పేరుకు ముందు రాఘవా అని ఉంటుండ‌డం మ‌నం గ‌మ‌నించాం. ఆయన రాఘవేంద్రుని బాగా కొలుస్తారు. అయితే ఈ సమాజ సేవకు, రాఘవ పేరుకు, చిన్నతనంలో లారెన్స్ కు వచ్చిన వ్యాధికి.. ఈమూడింటికి ఓ కామన్ లింక్ ఉందనే విష‌యం గురించి ఇప్పుడు నెట్టింట చ‌ర్చ న‌డుస్తుంది. చిన్న వయసులోనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడ్డ లారెన్స్‌ని చాలా మంది డాక్ట‌ర్స్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లింద‌ట‌. అయిన పెద్ద‌గా ఉప‌యోగం లేకుండా పోయింద‌ట‌.

అప్పుడు లారెన్స్ త‌ల్లి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ మరోవైపు తన కొడుకుకు చికిత్స అందించడంతో వ్యాధి త‌గ్గిపోయింద‌ట‌. అప్ప‌టి నుండి లారెన్స్ ఫ్యామిలీ అంద‌రు కూడా రాఘవేంద్రుడికి భక్తులుగా మారిపోయారు. అప్పటి నుండి లారెన్స్ కూడా త‌న పేరుకి ముందు రాఘ‌వ అని పెట్టుకున్నాడు. అయితే త‌ను బ్రెయిన్ ట్యూమ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డ్డ‌ప్పుడు త‌న త‌ల్లి ఎంత‌గా విల‌విల‌లాడిందో క‌ళ్లారా చూసిన లారెన్స్ మరొకరికి అలాంటి క‌ష్టం రావొద్ద‌ని స‌మాజ సేవ‌కి ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయిస్తూ అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు.