TGPSC: గ్రూప్‌ 1 మెయిన్స్‌పై విచారణ నాలుగు వారాలు వాయిదా!

గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌ జరిపించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. గ్రూప్‌ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందన్న పలువురు గ్రూప్‌ 1 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.

TGPSC: గ్రూప్‌ 1 మెయిన్స్‌పై విచారణ నాలుగు వారాలు వాయిదా!

TGPSC:  గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌ జరిపించాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది. గ్రూప్‌ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందన్న పలువురు గ్రూప్‌ 1 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే మూల్యాంకనం జరిపించారని పిటిషనర్లు ఆరోపించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినప్పటికి తగిన నిపుణులతో జవాబు పత్రాలను దిద్దించలేదని.. ఒకే నిపుణులతో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఒకే నిపుణుడితో రెండు భాషల పేపర్లు దిద్దించడంతో నాణ్యత కొరవడిందని పిటిషనర్లు ఆరోపించారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ వేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది.