Increases Salaries Allowances Of MPs: పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్స్ లు, పెన్షన్లు 24 శాతం పెంచుతు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2023ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెరిగిన జీతాలు, అలవెన్స్ లు, పెన్షన్ల పెంపు వర్తించనుంది. ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంచారు.
పార్లమెంట్ సమావేశాలు, అధికారిక విధుల సమయంలో అయ్యే ఖర్చులను ఉద్దేశించి అందించేటువంటి ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500లకు పెంచింది. అలాగే ప్రస్తుత, మాజీ ఎంపీల నెలవారి పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీ ఎంపీలకు పెన్షన్లు ఏప్రిల్ 2023 నుండి వర్తించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్స్ లు, పెన్షన్లు పెంచుతు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీల జీతభత్వాల పెంపు సవరణను లోక్‌సభ సెక్రటేరియట్ ఆమోదించింది. దీంతో తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దీంతో 2018 తర్వాత ఎంపీల జీతాలు, పెన్షన్లు పెరిగినట్లైంది.