LPG Gas | సామాన్యులకు షాక్.. సిలిండర్ గ్యాస్ ధరలు భారీగా పెంపు
LPG Gas | హోళీకి ముందు సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గృహ వినియోగ, కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గృహ వినియోగ వంట గ్యాస్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.350.50 చమురు కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ.1,103కు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119కి పెరిగింది. హైదరాబాద్‌లో గృహ వినియోగ […]
LPG Gas | హోళీకి ముందు సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గృహ వినియోగ, కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచింది. గృహ వినియోగ వంట గ్యాస్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.350.50 చమురు కంపెనీలు పెంచాయి.
పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. పెరిగిన ధరలతో డొమెస్టిక్ సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ.1,103కు చేరింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.2,119కి పెరిగింది. హైదరాబాద్‌లో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1150కి చేరింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధర రూ.50 పెరిగింది.
గత ఏడాది జూలై నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ రాగా.. తాజాగా రూ.50 పెంచాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మరింత పెరిగిన ధరలు మరింత భారం కానున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram