ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ పోషించి అలరించింది. భార్యగా, అక్కగా, అమ్మగా నటించి మెప్పించిన ప్రగతి సినిమాల్లో ఎంత పద్ధతిగా ఉంటుందో.. బయట అంత బోల్డ్ గా కనిపిస్తూ అందరికి షాక్ ఇస్తూ ఉంటుంది. ఈ వయస్సులోను ఎక్స్పోజింగ్ చేస్తూ అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక తనపై వచ్చిన రూమర్స్‌కి కూడా షాకింగ్ సమాధానాలు ఇస్తుంటుంది. ఇటీవల ప్రగతి.. రెండో పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా స్టార్ ప్రొడ్యూసర్ ను ప్రగతి పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారాలు సాగగా, ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో ప్రగతి స్పందించింది.
తన రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్లను సోషల్ మీడియా వేదికగా ప్రగతి ఖండిస్తూ.. అవి పూర్తి నిరాధారమైనవి అని పేర్కొంది. సాక్ష్యాలు ఉంటే రాయండి తప్ప తప్పుడు ప్రచారాలు చేయవద్దు అని కోరింది.. అసలు అలాంటిది ఉంటే తానే ముందుగా చెబుతాను కదా? అంటూ ఓ మీడియా సంస్థపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ప్రగతి కరోనా సమయం నుండి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ జిమ్‌లో వర్కవుట్ చేసే వీడియోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది. టైట్ డ్రెస్సులలో అందాలన్నింటిని బహిర్గతం చూస్తూ ప్రగతి చేసే రచ్చకి నెటిజన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ ఏజ్ లో కూడా జిమ్ లో అంత కష్టపడుతున్నారంటే ఆమెని మెచ్చుకోక తప్పదు అని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేస్తూ అందరిని షాక్‌కి గురి చేసింది. జిమ్ డ్రెస్‌లో వర్కవుట్స్ చేయడం కామన్. చీరకట్టులో చేయడం వెరైటీ అంటూ ప్రగతి ఇలా వర్కవుట్ చేసిందా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఏదేమైన ఈ భామ చీరలో 90 కేజీల బరువు మోయడం చూసి నిజంగా గ్రేట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రగతి సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. ప్రగతికి ఎఫ్ 2 చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో వరుణ్, వెంకీల అత్త పాత్రలో కనిపించి అదుర్స్ అనిపించింది.