క్లింకార పుట్టి అప్పుడే ఆరు నెలలు అయిందా.. ముంబైలో తన సతీమణితో రామ్ చరణ్ ఏం చేశారంటే..!
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన జంట దాదాపు పదేళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాపకి క్లింకార అని నామకరణం చేశారు. లలితసహస్త్ర నామాల్లోని బీజాక్షరాన్ని తన మనవరాలికి పేరుగా పెట్టినట్టు మెగాస్టార్ చిరంజీవి అప్పుడు చెప్పుకొచ్చారు. అయితే క్లింకార పుట్టినప్పటి నుండి నిత్యం ఆమె నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంది. రామ్ చరణ్ దంపతులు చాలా సార్లు తమ కూతురితో బయట కనిపించారు. కాని వారి లిటిల్ ప్రిన్సెస్ క్లింకార ఫోటో కాని..అందులో ఆ పాప ముఖం కాని కనిపించకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. అయితే అటు అభిమానులు, ఇటు మీడియా క్లింకార ఫేస్ క్యాప్చర్ చేసేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు. కాని అది జరగడం లేదు.
అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులకి జూన్ 20న క్లింకార జన్మించింది.పాప పుట్టి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా చరణ్ దంపతులు తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. చరణ్, ఉపాసన తమ పాప క్లిన్ కారాతో పాటు పాపని చూసుకునే నాని, చరణ్ స్టాఫ్ కూడా ఆలయంలో కనిపించారు. ఇక ఆలయం నుండి చరణ్ బయటకు రాగా, ఆయనతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఆసక్తి చూపించారు. ఇక పాప ఫేస్ కనపడకుండా ఉపాసన చాలా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం చరణ్ దంపతులు గుడికి వెళ్లి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం గత కొద్దిరోజులుగా ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. అందుకే చరణ్ ముంబైలోనే ఉంటున్నాడని తెలుస్తుంది. ఇటీవల ఉపాసన తన కూతురిని తీసుకొని ముంబైకి రాగా, ఆ సమయంలో చరణ్ ఇంట్లో నుండి బయటకు వచ్చి భార్య, పిల్లలని రిసీవ్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబుతో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram