స‌హ‌నం కోల్పోయి బ్యాట్‌ని నేల‌కి కొట్టిన‌ రిష‌బ్ పంత్.. క‌న్నీటి ప‌ర్యంత‌మైన ప‌రాగ్

స‌హ‌నం కోల్పోయి బ్యాట్‌ని నేల‌కి కొట్టిన‌ రిష‌బ్ పంత్.. క‌న్నీటి ప‌ర్యంత‌మైన ప‌రాగ్

ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్ర‌తి మ్యాచ్ కూడా చాలా ట‌ఫ్‌గా న‌డుస్తుంది. చివ‌రి వ‌ర‌కు కూడా గెలుపు ఎవ‌రిని వరిస్తుంద‌నేది చెప్ప‌డం క‌ష్టంగా మారింది. గురువారం ఢిల్లీ, రాజ‌స్థాన్ రాయల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ టీం 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.బ్యాటింగ్‌లో రియాన్ ప‌రాగ్ అద‌ర‌గొట్ట‌గా, బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్ స‌త్తా చాటాడు. మ్యాచ్‌లో ముందుగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ చేయ‌గా, ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 నాటౌట్) అరాచక‌కం సృష్టించాడు ..ఇక చివ‌ర‌లో రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 3 సిక్స్‌లతో 29), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 3 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులు మాత్ర‌మే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) కొంత రాణించిన కూడా రాజ‌స్థాన్ బౌల‌ర్స్ టైట్ బౌలింగ్‌కి ఢిల్లీ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బర్గర్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ సహనం కోల్పోయాడు. ఔటైన ఫ్రస్టేషన్‌లో బ్యాట్‌ను నేలకు కొట్టాడు. తాజా మ్యాచ్‌లో రిషబ్ పంత్ 26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 28 పరుగులే చేసి మ‌రోసారి నిరుత్సాహ‌ప‌రిచాడు. చాహల్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో పంత్ కావ‌డంతో తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యాడు.

గ్రౌండ్ దాటి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లే క్రమంలో బ్యాట్‌ను నేలకు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఆర్ఆర్‌కి మంచి విజ‌యం అందించిన రియాన్ ప‌రాగ్ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న రాజ‌స్థాన్‌ జట్టును విధ్వంసకర బ్యాటింగ్‌తో రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. మంచి ప్రదర్శన క‌న‌బ‌రిచిన రియాగ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మరో మూడు అవార్డులు ద‌క్కాయి. తన తల్లి ముందు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం గర్వంగా ఉందంటూ రియాన్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా నా కష్టాలను చూసిన ఆమెకు ఈ ప్రదర్శన మా అమ్మ‌కి చాలా సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం నేను ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. అనారోగ్యంతో గత మూడు రోజులుగా బెడ్‌పై ఉన్న నేను… పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఈ రోజే లేచాను. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉందంటూ రియాన్ ప‌రాగ్ భావోద్వేగ‌భ‌రితంగా మాట్లాడాడు.