Special Trains | హోలీకి 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఫుల్‌ డిటేయిల్స్‌ ఇవే..!

Special Trains | హోలీకి 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. ఫుల్‌ డిటేయిల్స్‌ ఇవే..!

Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్‌ చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది. హోలీ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 18 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఓ ప్రటకలనో పేర్కొంది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి గోమతినగర్‌, సంత్రగాచి, షాలిమార్‌, లాల్‌గఢ్‌, దర్భంగా, పట్నా, రక్సల్‌కు ఇరుమార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆయా ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.