Special Trains | హోలీకి మరో 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా 52 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. పండుగ సందర్భంగా వివిధ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్-దర్భంగా, హైదరాబాద్-పాట్నా, కాచిగూడ-రక్సల్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్-చాప్రా, గోరక్‌పూర్-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్-సంత్రగాచి, తాంబరం-సంత్రగాచితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో పట్టాలెక్కించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు గురువారం నుంచి ఏప్రిల్ 8 వరకు ఆయా మార్గాల్లో పరుగులు తీస్తాయని చెప్పింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.
