Bengaluru Theft | ఆ దొంగ టార్గెట్‌ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?

బెంగళూరులో వింత దొంగ! కేవలం మహిళల లోదుస్తులే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న కేరళ యువకుడి అరెస్ట్. నిందితుడి మొబైల్‌లో వీడియోలు చూసి షాకైన పోలీసులు.

Bengaluru Theft | ఆ దొంగ టార్గెట్‌ మహిళల లోదుస్తులే.. వాటితో ఏం చేసేవాడంటే..?

బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మనం చూశాం. వాటితోపాటూ పట్టు చీరలు, ఖరీదైన వస్తువులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను చోరీ చేస్తుంటారు. మరికొందరు ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను ఎత్తుకెళ్తుంటారు. అయితే, బెంగళూరులో (Bengaluru) ఓ దొంగ మాత్రం మహిళల లోదుస్తులే (Womens Innerwear) టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. వినేందుకు వింతగా ఉన్న ఇది నిజం.

గత కొన్ని రోజులుగా బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ (Bengaluru Electronic City) డివిజన్‌లో నివాస భవనాలపై ఆరేసిన లోదుస్తులు చోరీలకు గురవుతున్నాయి. అదే సమయంలో హెబ్బగోడి (Hebbagodi) ప్రాంతంలోని భవనాల టెర్రస్‌లపై, ఇంటి ప్రాంగణాల్లో ఆరబెట్టిన మహిళల లోదుస్తులను లక్ష్యంగా చేసుకున్న ఓ వ్యక్తిని స్థానికులు గుర్తించారు. అతడి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగను గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడు కేరళకు చెందిన 23 ఏళ్ల అమల్ ఎన్ అజిగా గుర్తించారు. పరిసరాల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని వాటిని దొంగిలించి పరారయ్యేవాడు.

విచారణలో భాగంగా నిందితుడి నివాసంలో పోలీసులు సోదాలు చేయగా.. పెద్ద మొత్తంలో దొంగిలించిన మహిళల లోదుస్తులు బయటపడ్డాయి. అనుమానం వచ్చి అతడి మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. అందులో దొంగిలించిన దుస్తులను ధరించి తీసుకున్న అనేక ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. వాటిని చూసి పోలీసులు షాక్‌ అయ్యారు. ఇదేం పని అని నిందితుడిని ప్రశ్నించగా.. మహిళల లోదుస్తులు ధరించినప్పుడు తనకు ‘మత్తుగా’ అనిపిస్తుందంటూ షాకింగ్‌ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై హెబ్బగోడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి :

Divya Bharathi | వాడియమ్మ.. షార్ట్ స్కర్ట్ లో ఆగం ఆగం చేస్తున్న దివ్య భారతి
Vijay-Rashmika | విజయ్–రష్మిక పెళ్లికి డ‌చ్ గులాబీలు…విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!