Vijay-Rashmika | విజయ్–రష్మిక పెళ్లికి డచ్ గులాబీలు…విషయం ఎలా బయటపడిందంటే..!
Vijay-Rashmika | టాలీవుడ్‌లో గత నాలుగేళ్లుగా హాట్ టాపిక్‌గా మారుతున్న జంట అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అనే చెప్పాలి. ‘గీతా గోవిందం’ సినిమాతో మొదలైన ఈ క్రేజ్, ఆ సినిమా విజయంతో పాటు వీరిద్దరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందన్న చర్చలకు బీజం వేసింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి కలిసి నటించడంతో ఈ రూమర్లు మరింత బలంగా మారాయి.
Vijay-Rashmika | టాలీవుడ్‌లో గత నాలుగేళ్లుగా హాట్ టాపిక్‌గా మారుతున్న జంట అంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అనే చెప్పాలి. ‘గీతా గోవిందం’ సినిమాతో మొదలైన ఈ క్రేజ్, ఆ సినిమా విజయంతో పాటు వీరిద్దరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందన్న చర్చలకు బీజం వేసింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి కలిసి నటించడంతో ఈ రూమర్లు మరింత బలంగా మారాయి. ఆ తర్వాత కాలంలో విజయ్, రష్మిక కలిసి బయట కనిపించిన ప్రతిసారీ సోషల్ మీడియాలో కొత్త కథలు మొదలయ్యాయి. కలిసి ట్రావెల్ చేయడం, ఒకే తరహా ఫోటోలు షేర్ చేయడం లాంటివి అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. మీడియా కంట పడకుండా ఉండేందుకు వీరిద్దరూ ప్రయత్నించినా, నెటిజన్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.
ఇక గత ఏడాది వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు విజయ్ గానీ, రష్మిక గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తమ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచడమే వీరి స్టైల్ కావడంతో, ఈ మౌనం అభిమానులకు మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇటీవల మరోసారి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందంటూ ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక, గత నాలుగేళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుందని మాత్రమే చెప్పారు. దీంతో క్లారిటీ వస్తుందా, లేక మరో ట్విస్ట్ ఉందా అన్న సందేహాలు మరింత పెరిగాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. విజయ్–రష్మిక జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పెళ్లి కోసం అత్యంత నాణ్యమైన డచ్ గులాబీలు పంపనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో, పెళ్లి వార్తలు నిజమేనన్న నమ్మకం అభిమానుల్లో బలపడుతోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా, బయట నుంచి వస్తున్న ఇలాంటి సంకేతాలు మాత్రం ఈ బంధం నిజమేనని చెప్పేలా చేస్తున్నాయి. ఒకవేళ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెడితే, అది టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులకు ఒక స్పెషల్ మూమెంట్‌గా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram