14న వసంత పంచమి.. ఈ శ్లోకాలు పఠిస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందట..!
ఈ నెల 14న వసంత పంచమి. ఈ నేపథ్యంలో సరస్వతీ ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆ రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు.

ఈ నెల 14న వసంత పంచమి. ఈ నేపథ్యంలో సరస్వతీ ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆ రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు. ఎందుకంటే.. ఆ రోజున అక్షరాభ్యాసం చేయిస్తే.. చదువుతో పాటు మంచి జ్ఞానాన్ని ఆ సరస్వతీ దేవీ ప్రసాదిస్తుందని నమ్మకం. అంతేకాకుండా వసంత పంచమి పర్వదినం మనలో విజ్ఞానానికి, కళలకు, జ్ఞానానికి ప్రతీకైన హిందూ దేవత సరస్వతి దేవికి అంకితం చేయబడింది. వసంత పంచమి పర్వదినాన్ని సరస్వతీ దేవీ పుట్టినరోజుగా కూడా నిర్వహిస్తారు.
ఇక మనం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించి ఏ విధంగా అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తామో … దేవి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజించి, దుర్గామాత కటాక్షం కోసం ఎదురుచూస్తామో, అదేవిధంగా సరస్వతి దేవి కోసం వసంత పంచమి రోజు పూజించి ప్రతి ఒక్కరిలో జ్ఞాన దీప్తిని వెలిగించాలని ప్రార్థిస్తాము.
అయితే వసంత పంచమి రోజున సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సరస్వతీదేవీకి నమస్కరించి ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మీరు చదువుకోవడంతో పాటూ ఇంట్లో ఉండే చిన్నారులకు, విద్యార్థులకు నేర్పిస్తే వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
సరస్వతీ శ్లోకం
ప్రణో దేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీ వతీ
ధీనామ విత్ర్య వతు ||
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవందినీ |
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః ||
పోతన చెప్పిన శ్లోకం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా….