టాలీవుడ్ హీరోపై సీనియ‌ర్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..అర్ధ‌రాత్రి నా బెడ్ రూమ్ త‌లుపు కొట్టి…

టాలీవుడ్ హీరోపై సీనియ‌ర్ న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..అర్ధ‌రాత్రి నా బెడ్ రూమ్ త‌లుపు కొట్టి…

సినీ ఇండ‌స్ట్రీలో మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగిన విష‌యం తెలిసిందే. ఈ ఉద్య‌మం త‌ర్వాత చాలా మంది హీరోయిన్స్ నిర్భ‌యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. త‌మ కెరీర్‌లో ఎదుర్కొన్న విచిత్ర సంఘ‌ట‌న‌ల గురించి ఓపెన్‌గా చెప్పేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది సౌత్ సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల. తమకు గతంలో జరిగిన అనుభ‌వాల‌ని తాజాగా చెప్పుకొచ్చి షాకిచ్చింది. త‌మిళ న‌టి అయిన వెన్నిరాడై నిర్మ‌ల సౌత్‌లో అన్ని భాష‌ల‌లో న‌టించి న‌టిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. తెలుగు,తమిళ, మలయాళ , కన్నడ నాలుగు భాషల్లో కలిపి దాదాపు 300 లకు పైగా సినిమాల్లో న‌టించి అల‌రించింది.

చాలా సంప్ర‌దాయంగా క‌నిపించే నిర్మ‌ల తెలుగులో స్టార్ సీనియ‌ర్ హీరోల‌కి త‌ల్లిగా కూడా న‌టించింది. తాజాగా ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో లైంగిక వేదింపులకు ప్రత్నించాడని చెప్పుకొచ్చిం ది. తాను తెలుగులో చాలా సినిమాలు చేసానంటూ చెప్పుకు రాగా, ఎన్నో పాత్ర‌లు త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చాయ‌ని తెలిపింది. తెలుగు జ‌నాలు త‌న‌ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వారి ప్రేమ‌ని ఎప్ప‌టికి మ‌రిచిపోలేను అని పేర్కొంది. అయితే తెలుగు స్టార్ హీరో వల్ల త‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంద‌ని తెలియ‌జేసింది. కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించగా .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతుండ‌గా, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు..

ఆ హీరో తలుపు గట్టిగా కొట్టి తలుపు తీయండి అంటూ అరిచాడు. కాని భ‌య‌ప‌డి నేను తీయ‌లేదు. నేను మిమ్మ‌ల్ని ఏం చేయ‌ను. మీ ద‌గ్గ‌ర‌కు ఒక‌సారి వ‌చ్చి వెళ్లిపోతానంటూ గ‌ట్టిగా అర‌వ‌డం చేశాడ‌ట‌. అత‌ను ఫుల్‌గా తాగి వ‌చ్చిన విష‌యం అర్ధ‌మై నేను త‌లుపు తీయ‌లేదు. అప్పుడు నేను అత‌నిని అలా చూసి షాక‌య్యాను. అంత పెద్ద హీరోకి ఇలాంటి పాడు అల‌వాటు ఉందా అని బాధ‌ప‌డ్డాను. అయితే ఎన్ని సార్లు అత‌ను త‌లుపు కొట్టిన నేను తీయ‌క‌పోవ‌డంతో అక్క‌డి నుండి వెళ్లిపోయాడు అంటూ నిర్మ‌ల గ‌తంలో త‌న‌కు జ‌రిగిన ఓ అనుభ‌వాన్ని చెప్పుకొచ్చి వార్త‌ల‌లో నిలిచింది. మ‌రి ఇంత‌కు ఆ స్టార్ హీరో ఎవ‌రో అనేది తెలియాల్సి ఉంది. తమిళంలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిర్మల.. వెన్నిరాడై సినిమాతో బాగా పాపులర్ కావ‌డంతో వెన్నిరాడై నిర్మలగా పేరు స్థిరపడి పోయింది.