Site icon vidhaatha

బ్రేక‌ప్ చెప్పింద‌ని.. ఆమె టాయిలెట్‌ను దొంగిలించిన బాయ్ ఫ్రెండ్

ప్రేమికుల మ‌ధ్య బ్రేక‌ప్‌లు స‌హజం. ఇక బ్రేకప్ చెప్పిన‌ప్పుడు ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు లోన‌వుతారు. ఈ సంద‌ర్భంలో దాడుల‌కు కూడా వెనుకాడ‌రు. హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతారు. ఇక ఇంట్లో విలువైన వ‌స్తువులు ఉంటే కూడా ఎత్తుకెళ్తారు. అయితే ఓ ప్రియుడు కూడా త‌న ప్రియురాలు బ్రేకప్ చెప్పింద‌ని.. ఆమె ఇంట్లో ఉన్న టాయిలెట్ అప‌హ‌రించాడు. ఇది చ‌ద‌వ‌డానికి విడ్డూరంగా ఉన్న‌ప్ప‌టికీ నిజ‌మే.

ప్రియురాలి మాట‌ల్లోనే.. నేను నిన్న రాత్రి నా బాయ్ ఫ్రెండ్‌తో గొడ‌వ‌ప‌డ్డాను. ఆ త‌ర్వాత నిద్ర‌లోకి జారుకున్నాను. నా ప్రియుడు లైసెన్స్ క‌లిగిన ప్లంబ‌ర్. దాంతో వాష్‌రూమ్‌లో ఉన్న టాయిలెట్‌ను అప‌హ‌రించాడు. ఉద‌యం లేచి చూడ‌గానే టాయిలెట్ క‌నిపించ‌లేదు. దాన్ని బాయ్ ఫ్రెండ్ అప‌హ‌రించిన‌ట్లు తేలింది. ఆ విష‌యం తెలిసిన త‌ర్వాత చాలా న‌వ్వు వ‌చ్చింది. ప్ర‌తి రోజు గొడ‌వ ప‌డేవాడు. ఇక పెద్ద‌గా టీవీ సౌండ్ పెంచేదాన్ని. ఆ త‌ర్వాత గాఢ నిద్ర‌లోకి జారుకునేదాన్ని. మొత్తానికి బాయ్ ఫ్రెండ్ టాయిలెట్‌ను దొంగిలించ‌డం న‌వ్వు తెప్పించింద‌ని ఆమె తెలిపారు. ఇక కొత్త టాయిలెట్‌ను అమ‌ర్చిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఆ ప్రేమికులు బ్రేక‌ప్ కావ‌డం చాలా బాధాక‌రం. అయితే టాయిలెట్‌ను ఎత్తుకెళ్లిన ఆ ప్రియుడు.. నీట్‌గా అప‌హ‌రించాడ‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. చివ‌ర‌కు వాష్‌రూమ్‌లో మిగిలిన టిష్యూ కూడా అప‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు. మొత్తానికి వీరి బ్రేక‌ప్ నెటిజ‌న్ల‌కు వింత‌గా మారింది. 

Exit mobile version