Site icon vidhaatha

మేడ‌పై బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో యావ‌ర్ రొమాన్స్… అడ్డంగా దొరికిపోయారుగా..!

బిగ్ బాస్ షోతో ప్ర‌తి ఒక్క‌రికి మంచి పాపులారిటీ వ‌స్తుంది. షోలో అద్భుత‌మైన గేమ్ ఆడి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకునే కంటెస్టెంట్స్ మంచి సినిమా ఆఫ‌ర్స్ కూడా అందిపుచ్చుకుంటారు. ఇక హౌజ్‌లో కొంద‌రు కొంద‌రికి బాగా కనెక్ట్ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ సారి సీజ‌న్ 7లో యావ‌ర్, ప్ర‌శాంత్‌, శివాజీ బాగా క‌నెక్ట్ కాగా వారికి జ‌త‌గా న‌య‌ని పావ‌ని కూడా చేరింది. ఉన్న‌ది వార‌మే అయిన ఆ బ్యాచ్‌తో ఎక్కువ‌గా క‌లిసిపోయింది. ముఖ్యంగా శివాజీతో మంచి బాండింగ్ ఏర్ప‌ర‌చుకుంది. ఆయ‌న త‌న‌కు డాడి లాంటి వార‌ని చెప్పుకొచ్చింది.

సీజ‌న్ 7 పూర్త‌య్యాక శివాజీ బ్యాచ్‌తో కలిసి తెగ సంద‌డి చేస్తుంది. శివాజీకి పల్లవి ప్రశాంత్, యావర్ శిష్యులుగా వ్యవహరించారు. వీరి పేర్లలో మొదటి అక్షరాలు కలిపి స్పై బ్యాచ్ గా నామకరణం చేశారు. ఇందులో ప్ర‌శాంత్ క‌ప్ కొట్ట‌గా, యావ‌ర్ టాప్ 5లో నిలిచి ప‌దిహేను ల‌క్ష‌ల సూట్‌కేసుతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు ర‌తిక రోజ్‌తో పులిహార కలిపాడు. ఒక దశలో రతిక వలన యావర్ గేమ్ ట్రాక్ తప్పింది. శివాజీ, ప్రశాంత్ లను కూడా పక్కన పెట్టే పరిస్థితి రాగా, ఆ స‌మ‌యంలో నాగార్జున హెచ్చరించడంతో తేరుకుని రొమాంటిక్ యాంగిల్ వదిలేసి గేమ్‌పై దృష్టి పెట్టాడు. టాప్ 5లో నిలిచాడు.

అయితే యావ‌ర్‌కి, న‌య‌ని పావ‌నికి హౌజ్‌లో ఉన్న‌ప్పుడు పెద్ద‌గా బాండింగ్ లేక‌పోయిన బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం వారు ఎంతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నారు. తాజాగా నయని పావనితో యావర్ తెగ రొమాన్స్ చేయ‌గా, ఇందుకు సంబంధించిన వీడియోని న‌య‌ని పావ‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చల్లని రాత్రివేళ మేడపై ఆమెతో సరసాలు ఆడుతూ,ఇద్ద‌రు చాలా రొమాంటిక్‌గా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌గా, వీరిద్ద‌రిపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్ద‌రి జోరు చూస్తే రానున్న రోజుల‌లో ల‌వ‌ర్స్‌గా మారిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు


Exit mobile version