Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 కాన్సెప్ట్ లీక్.. ఒకే షోలో రెండు హౌజ్‌లు

Bigg Boss7 | బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 మరి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది . నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం కానున్న ఈ షోలో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త సీజ‌న్ దారుణంగా నిరాశ‌ప‌ర‌డ‌చంతో ఈ సారి నిర్వాహ‌కులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. హౌజ్ ద‌గ్గ‌ర నుంచి కంటెస్టెంట్స్ వ‌ర‌కు ప్ర‌తీది స‌రికొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 7 […]

  • By: sn    latest    Aug 28, 2023 10:55 AM IST
Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 కాన్సెప్ట్ లీక్.. ఒకే షోలో రెండు హౌజ్‌లు

Bigg Boss7 |

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 మరి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది . నాగార్జున హోస్ట్‌గా ప్రారంభం కానున్న ఈ షోలో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త సీజ‌న్ దారుణంగా నిరాశ‌ప‌ర‌డ‌చంతో ఈ సారి నిర్వాహ‌కులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

హౌజ్ ద‌గ్గ‌ర నుంచి కంటెస్టెంట్స్ వ‌ర‌కు ప్ర‌తీది స‌రికొత్త‌గా ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 7 కాన్సెప్ట్ లీక్ అయింది. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌ పోతున్నారు. షో కాన్సెప్ట్ ఏదో బాగుంద‌ని, ఈ సారి బాగా హిట్ అవుతుంద‌ని కొంద‌రు జోస్యాలు కూడా చెప్పుకొస్తున్నారు.

కంటెస్టెంట్స్ ఎంపిక నుండి గేమ్స్, టాస్క్స్ తో పాటు ఏకంగా షో ఫార్మాట్‌ని కూడా పూర్తిగా మార్చేసార‌ని తెల‌స్తుంది. ఈ సారి హౌజ్‌లోకి ఏకంగా 20 మందిని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, వారి కోసం రెండు వేర్వేరు హౌజ్‌లు రూపొందించ‌బోతున్నార‌ట‌. అంటే ఒక షోలో మ‌నం రెండు హౌజ్‌లు చూడబోతున్నాం.

కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్క్స్, పరిస్థితులు, ప్రవర్తన ఆధారంగా కంటెస్టెంట్స్‌ని రెండుగా విభ‌జించి ఆయా ఇళ్ల‌లోకి పంపుతార‌ట‌. ఈ కాన్సెప్ట్ చాలా కొత్త‌గా ఉండ‌డంతో పాటు రంజుగా కూడా ఉండేలా క‌నిపిస్తుంది. స‌రికొత్త‌గా ఈ కాన్సెప్ట్ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ ఆదరణ దక్కడం ఖాయం అంటున్నారు.

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 ప్రసారం కానున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. హీరోయిన్ ఫర్జానా, అబ్బాస్, షకీలా వంటి క్రేజీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండ‌డంతో షోపై రోజురోజుకి ఆస‌క్తి పెరుగుతుంది.

మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, జబర్ధస్త్ మహేశ్, యాంకర్ నిఖిల్, కమెడియన్ రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, పవిత్ర తదితరులు కూడా షోలో పాల్గొన‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి కొద్ది రోజుల‌లో వీటిపై పూర్తి క్లారిటీ రానుంది.