Bigg Boss7 | బిగ్ బాస్ తొలి వారం ఎలిమినేషన్స్.. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారంటే..!
Bigg Boss7 | బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా. గత సీజన్స్ కి భిన్నంగా ఈ సీజన్ ఉంది. హౌజ్‌లోకి 14 మందిని పంపించగా, వారిలో కంటెస్టెంట్‌గా ఫిక్స్ అయిన వారు ఎవరు లేరు. ఇక వారికి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆడేవాళ్లతో పాటు చూసేవారికి కూడా ఈ సీజన్ కొంత అయోమయంగానే ఉంటుందని అనిపిస్తుంది. అయితే ప్రతి వారం నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తొలివారం నామినేషన్స్ కొంత […]

Bigg Boss7 |
బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా. గత సీజన్స్ కి భిన్నంగా ఈ సీజన్ ఉంది. హౌజ్‌లోకి 14 మందిని పంపించగా, వారిలో కంటెస్టెంట్‌గా ఫిక్స్ అయిన వారు ఎవరు లేరు. ఇక వారికి ఎలాంటి సదుపాయాలు లేవు. ఆడేవాళ్లతో పాటు చూసేవారికి కూడా ఈ సీజన్ కొంత అయోమయంగానే ఉంటుందని అనిపిస్తుంది. అయితే ప్రతి వారం నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అయితే తొలివారం నామినేషన్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. హౌజ్‌లోకి వచ్చిన రెండో రోజే ఒక కంటెస్టెంట్‌ని జడ్జి చేసి మాతో కలవలేదు, వారు అర్ధం కాలేదు అని మనం చెప్పలేం. కానీ గేమ్స్ రూల్స్ ప్రకారం ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి కాబట్టి ఏదో ఒక కారణం వెతుక్కొని మరీ నామినేట్ చేయాల్సి ఉంటుంది.
తొలి వారం హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో 8 మంది నామినేట్ అయ్యారు. కంటెస్టెంట్స్ ఎవరినైతే ఎక్కువగా నామినేట్ చేసారో వారు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఆ ఎనిమిది మందిలో ముందుగా శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, నటి కిరణ్ రాథోడ్ , నటుడు గౌతమ్ కృష్ణ, నటి షకీలా, సింగర్ దామిని ఉన్నారు.
వీరిలో ఒకరు శని లేదా ఆదివారాలలో ఎలిమినేట్ కానున్నారు. లేదంటే తొలివారం కాబట్టి ఎలిమినేషన్ ఎత్తేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతా ఉల్టా పుల్టా కాబట్టి ఏమైన జరగొచ్చు.ఇక నామినేషన్ ప్రక్రియ ఏమో కాని అప్పుడే హౌజ్‌మేట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొందరు మిస్ అండర్ స్టాండిగ్‌తో నామినేషన్ చేసి తమ తప్పును సరిదిద్దుకోగా, మరి కొందరు మాత్రం తామే కరెక్ట్ అన్నట్టు ఉన్నారు.
అత్యధికంగా 21 మంది అత్యల్పంగా 19 మంది కంటెస్టెంట్స్ ఉండడం మనం చూశాం. కాని ఈ సీజన్ కి కేవలం 14 మంది హౌజ్‌మేట్స్‌ని హౌజ్‌లోకి పంపారు. నవీన్ పోలిశెట్టిని కూడా కంటెస్టెంట్‌గా పంపినట్టు బిల్డప్ ఇచ్చిన తర్వాత ఆయన తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చినట్టు అర్ధమైంది.
అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్య మధ్యలో కంటెస్టెంట్స్‌ని ప్రవేశపెడతారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎప్పటి లాగే 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుండగా, అబ్బాస్, ఫర్జానా, పూజా మూర్తి, జబర్దస్త్ నరేష్, మహేష్ ఆచంట, మొగలి రేకులు సాగర్ వంటి వారు రానున్న రోజులలో బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.