Bigg Boss-7 | బిగ్‌బాస్‌ వచ్చేస్తున్నాడు..! అఫీషియల్‌ డేట్‌ ప్రకటించిన స్టార్‌ మా..!

Bigg Boss-7 | తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ప్రసారానికి ముహూర్తం ఖారైంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఏడో సీజన్‌ ఎప్పటి నుంచి ప్రసారం చేయనుందో స్టార్‌ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రోమోను సైతం విడుదల చేసింది. ఈ సీజన్‌ను సైతం నాగార్జున హోస్ట్‌ చేయనుండగా.. ఈ సీజన్‌ను సరికొత్త మేకర్స్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తున్నది. గతంలో మాదిరిగా ఈ […]

Bigg Boss-7 | బిగ్‌బాస్‌ వచ్చేస్తున్నాడు..! అఫీషియల్‌ డేట్‌ ప్రకటించిన స్టార్‌ మా..!

Bigg Boss-7 |

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ప్రసారానికి ముహూర్తం ఖారైంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఏడో సీజన్‌ ఎప్పటి నుంచి ప్రసారం చేయనుందో స్టార్‌ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 3వ తేదీ నుంచి ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రోమోను సైతం విడుదల చేసింది. ఈ సీజన్‌ను సైతం నాగార్జున హోస్ట్‌ చేయనుండగా.. ఈ సీజన్‌ను సరికొత్త మేకర్స్‌ ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తున్నది.

గతంలో మాదిరిగా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ ఆటలు చెల్లవని, బిగ్‌బాస్‌ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని ప్రోమోలో నాగార్జున పేర్కొన్నారు. ఆరో సీజన్‌ పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. కంటెస్టెంట్స్‌ ఎంపిక, టాస్సులు తదితర కారణాలతో సీజన్‌ చప్పగా సాగింది.

ఈ నేపథ్యంలో ఈ సారి కంటెస్టెంట్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించి దాదాపు ప్రేక్షకులందరికీ తెలిసిన ముఖాలు, వివిధ వ్యవహారాలతో హాట్‌ టాపిక్‌గా మారిన వారినే ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. అలాగే ఈ సారి టాస్క్‌లు కొత్తగా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తున్నది. ఈ సీజన్‌ గత సీజన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుందని హోస్ట్‌ నాగార్జున ప్రోమోలో స్పష్టం చేశారు.

కంటెస్టెంట్స్‌ వీరేనా..

అయితే, బిగ్‌బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బీబీ హౌస్‌లోకి వెళ్లేది ఎవరనేది సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బుల్లితెర మెగాస్టార్‌, ప్రముఖ టీవీ నటుడు ఈటీవీ ప్రభాకర్‌, సీరియల్‌ నటి నవ్యస్వామి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ వర్ష పేర్లు సైతం వినిపిస్తున్నాయి.

వీరితో జబర్దస్త్‌ కమెడియన్స్‌ బుల్లెట్‌ భాస్కర్‌, నరేశ్‌, పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. వీరితో పాటు యూట్యూబర్‌ అనిల్‌ గీలా, ఆట సందీప్‌, సింగర్‌ మోహన భోగరాజు, టీవీ సీనియల్‌ నటుడు అమర్‌దీప్‌-తేజస్వి గౌడ జట, అలాగే టీవీ నటి శోభాశెట్టి తదితర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎవరు బీబీ హౌస్‌లోకి వెళ్లనున్నారో తెలియనున్నది.