python snake mistake| పైథాన్ అనుకొని పట్టుకుంది.. బతికేందుకు ఆసుపత్రికి కోట్ల బిల్లు!
రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఎదురుపడిన ఓ చిన్నపామును చిన్న కొండ చిలువ పిల్లగా భావించి పట్టుకున్న పొరపాటుకు ఓ మహిళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకంగా $1.58 మిలియన్ల ఆసుపత్రి బిల్లు కట్టాల్సిన పరిస్థితికి గురవ్వడం వైరల్ గా మారింది.
విధాత : రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఎదురుపడిన ఓ చిన్నపామును చిన్న కొండ చిలువ పిల్లగా భావించి పట్టుకున్న పొరపాటుకు ఓ మహిళ ప్రాణాలు కాపాడుకునేందుకు ఏకంగా $1.58 మిలియన్ల ఆసుపత్రి బిల్లు కట్టాల్సిన పరిస్థితికి గురవ్వడం వైరల్ గా మారింది. ఫ్లోరిడా ఇన్‌ఫ్లుయెన్సర్ అలిస్సా ఐయోయా రాత్రిపూట రోడ్డుపై నడుస్తున్న క్రమంలో ఓ చిన్న పాము ఎదురుపడింది. ఆ పామును పిల్ల కొండచిలువ అని భావించి దాన్ని పట్టుకుంది. ఈ క్రమంలో విషపూరితమైన కాటన్‌మౌత్(వాటర్ మొకాసిన్) పాము ఆమె చేతిపై కాటు వేసింది. ఆ వెంటనే విష ప్రభావానికి లోనవ్వడంతో వెంటనే ఆమె వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి పరుగు తీసింది.
అలిస్సా ఐయోయా బతకడానికి అవసరమైన వైద్య చికిత్సకు ఏకంగా $1.58 మిలియన్ల(భారత కరెన్సీలో సుమారు రూ.14.5 కోట్లు) ఆసుపత్రి బిల్లు చెల్లించాల్సి రావడం ఆమెకు మరింత షాక్‌కు గురి చేసింది. అందులో చాల వరకు బీమా కంపెనీ చెల్లించడంతో ఈ వ్యవహారంలో ఆమెకు భారీ ఊరట దక్కింది. తనకు వచ్చిన ఆసుపత్రి బిల్లులో $1,946.29(రూ 1,78,475) మాత్రమే ఆమె చెల్లించింది.
నీటి పాములలో విషపూరిత జాతి
ప్రపంచంలో అత్యంత విషపూరిత పాములలోప్రధానంగా కాటన్ మౌత్ పాము లేదా వాటర్ మొకాసిన్ పాము కూడా ఒకటి. సాధారణంగా నీటి పాములు విషపూరితం కావు. అయితే నీటిలోనే ఉండే కాటన్‌మౌత్ స్నేక్ తలనిండా విషం ఉంటుంది. ఉత్తర, ఆగ్నేయ అమెరికాలో కనిపించే ఈ పాములకు తెల్లటి నోరు కారణంగా కాటన్‌మౌత్ అనే పేరు వచ్చింది. ఇవి 1.5 నుంచి 4.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఆగ్నేయ అమెరికా అంతటా ఇవి కనిపిస్తాయి. కాటన్‌మౌత్ కాటు వేయడం చాలా అరుదు అయినప్పటికీ, దాని విషంలో శక్తివంతమైన రక్త టాక్సిన్ ఉంటుంది. ఇది మానవులకు ప్రాణాంతకం. కాటన్‌మౌత్ పాములు వైపర్ జాతికి చెందినవి. ఇవి 1.5అడుగుల నుంచి 4 అడుగుల పొడవు, త్రిభుజాకార తలలతో ఉంటాయి. ఇవి ముదురు గోధుమ రంగు నుంచి నల్లటి రంగుల్లో కనిపిస్తాయి. భారత్ లో ఈ రకమైన పాములు మనుగడలో లేవని సరీసృప నిపుణులు వెల్లడిస్తున్నారు.

పైథాన్ అనుకోని విష సర్పాన్ని పట్టుకున్న మహిళ..!
అది కాటు వేయడంతో, బ్రతికి బట్ట కట్టడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది pic.twitter.com/0omNQuPr5k
— UttarandhraNow (@UttarandhraNow) February 1, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram