KCR SIT inquiry| కేసీఆర్ విచారణకు నందినగర్ నివాసానికి సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిట్ బృందం నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్ తో నందినగర్ నివాసానికి బయలుదేరారు. ప్రస్తుతం కేసీఆర్ నందినగర్ నివాసం లోపలికి వెళ్లారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 01, 2026, 1:05 pm IST
Read Time: 3 mins
KCR SIT inquiry| కేసీఆర్ విచారణకు నందినగర్ నివాసానికి సిట్

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిట్ బృందం నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. అడిషనల్ డీఎస్సీ కేఎస్. రావు సిట్ బృందం విచారణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలతో అక్కడికి చేరుకుంది. కేసీఆర్ ఇంట్లోని రెండో ఫ్లోర్ లోని గదిలో కేసీఆర్ ను విచారించేందుకు సిద్దమయ్యారు. విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్ తో నందినగర్ నివాసానికి బయలుదేరారు. అయితే పోలీసులు మాత్రం కేసీఆర్ వాహనాన్ని మాత్రమే నందినగర్ నివాసం లోపలికి అనుమతించారు. ప్రస్తుతం కేసీఆర్ నందినగర్ నివాసం లోపలికి వెళ్లారు. వైద్య సిబ్బందిని కూడా విచారణ బృందం సిద్దం చేసుకుంది.

నందినగర్ నివాసం చుట్టు పోలీసులు మోహరింపు

సిట్ విచారణ నేపథ్యంలో నందినగర్ కేసీఆర్ నివాసం చుట్టు పోలీసులు భారీగా మోహరించారు. నందినగర్ నివాసం చుట్టు నాలుగు అంచల భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ ను మళ్లీంచారు. కేసీఆర్ తో పాటు కుటుంబ సభ్యులైన హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను మాత్రమే నందినగర్ నివాసం పరిధిలోకి అనుమతించారు. విచారణ గదిలోకి మాత్రం కేసీఆర్ ఒక్కడినే అనుమతించనున్నారు. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వందల సంఖ్యలో చేరుకున్నారు.