Bigg Boss7 | మరి కొద్ది గంట‌ల‌లో మొద‌లు కానున్న బిగ్ బాస్.. హౌజ్‌లో అడుగుపెట్ట‌నుంది వీరేనా?

Bigg Boss7 | ప్ర‌తి ఏడాది దాదాపు వంద రోజుల పాటు ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ కార్య‌క్ర‌మం ఈ రోజు సాయంత్రం 7గంట‌ల నుండి ప్ర‌సారం కానుంది. ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతో సీజ‌న్ 7పై మ‌రింత ఆస‌క్తి పెంచారు. కుడిఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ప్రోమోలో నాగార్జున చెప్ప‌డంతో ఈసారి బిగ్‏బాస్ షోలో మార్పులు చాలానే ఉన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. సీజ‌న్ […]

  • By: sn    latest    Sep 03, 2023 4:50 AM IST
Bigg Boss7 | మరి కొద్ది గంట‌ల‌లో మొద‌లు కానున్న బిగ్ బాస్.. హౌజ్‌లో అడుగుపెట్ట‌నుంది వీరేనా?

Bigg Boss7 |

ప్ర‌తి ఏడాది దాదాపు వంద రోజుల పాటు ప్రేక్ష‌కుల‌ని ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ కార్య‌క్ర‌మం ఈ రోజు సాయంత్రం 7గంట‌ల నుండి ప్ర‌సారం కానుంది. ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతో సీజ‌న్ 7పై మ‌రింత ఆస‌క్తి పెంచారు.

కుడిఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ప్రోమోలో నాగార్జున చెప్ప‌డంతో ఈసారి బిగ్‏బాస్ షోలో మార్పులు చాలానే ఉన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. సీజ‌న్ 6 నుండి నేర్చుకున్న పాఠాల‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సీజ‌న్ 7ని స‌రికొత్తగా మార్చి ప్రేక్షకులకి కొత్తదనం చూపించబోతున్నారని తెలుస్తుంది.

అయితే ఈ సారి హౌజ్ లోకి పాపులారిటీ ఎక్కువగా ఉన్న కంటెస్టెంట్స్‌ని తీసుకురాబోతున్నార‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. అంతేకాదు కంటెస్టెంట్ లిస్ట్స్ కూడా హ‌ల్ చల్ చేశాయి.

టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. మోడల్స్, సీరియల్ నటీనటులు, యూట్యూబర్స్, సింగర్స్ ఇలా చాలా మంది బిగ్ బాస్ 7లో అడుగుపెడుతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారాలు సాగిన వాటిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే బిగ్‏బాస్ ఇంట్లోకి వెళ్లే 20 మంది వీరేనంటూ కొత్త లిస్ట్ ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ముందుగా బుల్లితెర సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి పేరు ఎక్కువ‌గా వినిపిస్తుండ‌గా, ఆ తర్వాత ఆట సందీప్, కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి, మోడల్ ప్రిన్స్ యవర్ (నా పేరు మీనాక్షి ఫేమ్), సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే , సీరియల్ నటి ప్రియాంక జైన్, సీరియల్ నటి శుభ శ్రీ, అప్పటి హీరో శివాజీ, హీరోయిన్ ఫర్జానా, షకీలా, నటుడు గౌతమ్ కృష్ణ (ఆకాశవీధిలో ఫేమ్), జబర్దస్త్ నటుడు యూట్యూబ్ ఫేం తేజ (టేస్టీ తేజ), మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి, పల్లవి ప్రశాంత్ (కామన్ మాన్) ఇప్ప‌టికే హౌజ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తుంది.

ఇక వీరితో పాటు సింగర్ దామినీ, హీరోయిన్ రితిక నాయక్, ప్రభాకర్, మహేష్ ఆచంట, అర్జున్ అంబటి, అంజలి పవన్ కూడా బిగ్ బాస్ 7 ఛాన్స్ ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. అయితే యాంకర్ నిఖిల్, పూజా మూర్తి ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ ద‌క్కించుకున్నా కూడా ప‌లు కార‌ణాల వ‌లన వారు త‌ప్పుకున్న‌ట్టు స‌మాచారం.

మొగలి రేకులు ఫేం సాగర్, యువ సామ్రాట్, అనిల్ గీలా, అన్షూరెడ్డి, మోహన భోగరాజు, జబర్దస్త్ నరేష్ వంటి వారికి కూడా బిగ్ బాస్ ఛాన్స్ ద‌క్కిన‌ప్ప‌టికీ ఇత‌ర కార‌ణావ‌లన వారు డ్రాప్ అయిన‌ట్టు ప్ర‌చారం నడుస్తుంది.ఇక ఈ షోకి నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే.