Bank Holidays | ఖాతాదారుల‌కు అల‌ర్ట్.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు సెలవులు..!

Bank Holidays | ఖాతాదారుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రిపే ఖాతాదారులు( Account Holders ) అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం ఇది. ఎందుకంటే జ‌న‌వ‌రి 24 నుంచి వ‌రుస‌గా నాలుగు రోజులు బ్యాంకులు( Bank Holidays ) మూత‌ప‌డ‌నున్నాయి.

  • By: raj |    business |    Published on : Jan 21, 2026 8:40 AM IST
Bank Holidays | ఖాతాదారుల‌కు అల‌ర్ట్.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు సెలవులు..!

Bank Holidays | ఖాతాదారుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌. నిత్యం బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రిపే ఖాతాదారులు( Account Holders ) అప్ర‌మ‌త్తం కావాల్సిన స‌మ‌యం ఇది. ఎందుకంటే జ‌న‌వ‌రి 24 నుంచి వ‌రుస‌గా నాలుగు రోజులు బ్యాంకులు( Bank Holidays ) మూత‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఖాతాదారులు ముందే త‌మ ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకోవ‌డం బెట‌ర్. మ‌రి ఏయే రోజులు బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఐదు రోజుల ప‌ని దినాల‌ను కోరుతూ బ్యాంకు ఉద్యోగులు స‌మ్మెకు పిలుపునిచ్చారు. ఈ స‌మ్మె జ‌న‌వ‌రి 27న చేయ‌నున్నారు. ఇక సాధార‌ణంగా ప్ర‌తి నెల రెండో శ‌నివారం, నాల‌గ‌వ శ‌నివారం, ఆదివారాలు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ నెల 24న నాల‌గ‌వ శ‌నివారం, 25న ఆదివారం, 26న రిప‌బ్లిక్ డే కార‌ణంగా బ్యాంకులు మూత‌ప‌డ‌నున్నాయి. 27న స‌మ్మెకు పిలుపునివ్వ‌డంతో ఆ రోజు కూడా బ్యాంకులు మూసి ఉంచే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఖాతాదారులు బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను ముందుగానే ముగించుకుంటే మంచిది.

ఉద్యోగులు పని గంటలను తగ్గిస్తే కస్టమర్లకు సేవలు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని UFBU ప్రకటించింది. UFBU (యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) ప్రకారం, RBI, LIC, GIC మొదలైనవి ఇప్పటికే 5 రోజుల పని వారాన్ని అనుసరిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్య మార్కెట్, ద్రవ్య మార్కెట్, స్టాక్ ఎక్స్ఛేంజీలు శనివారాల్లో పనిచేయవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా శనివారాల్లో పనిచేయవు. అందువల్ల బ్యాంకులు 5 రోజుల పని దినాల‌ను ఎందుకు అమలు చేయలేవని యూఎఫ్‌బీయూ ప్రశ్నిస్తోంది.