SBI Har Ghar Lakhpati scheme | కేవలం రూ. 610 పెట్టుబడితో.. లక్షాధికారి అయిపోండి.. ఎస్బీఐ బంపరాఫర్
SBI Har Ghar Lakhpati scheme | మీకు కోట్లకు పడగలెత్తాలని ఉన్నప్పటికీ.. సాధ్యం కావడం లేదా..? కనీసం లక్షాధికారినైనా కావాలని ఉందా..? అయితే మీ లాంటి వారికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) సరికొత్త పథకాన్ని అందిస్తోంది. అదే హర్ ఘర్ లఖ్‌పతి స్కీం( SBI Har Ghar Lakhpati scheme ). ఈ పథకం కింద కేవలం రూ. 610 పెట్టుబడితో లక్షాధికారి అయిపోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న హర్ ఘర్ లఖ్‌పతి పథకం ప్రత్యేక రికరింగ్ డిపాజిట్( RD ). ఇందులో ఖాతాదారులు ఎంచుకున్న కాలపరిమితితో పాటు ప్రతి నెల ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. కాలపరిమితి పూర్తయ్యాక ఒకేసారి అసలు, వడ్డీ కలిపి మన ఖాతాలో జమ అవుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పొదుపును అలవాటు చేయడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా చేయడం.
మరి మెచ్యూరిటీ..?
ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 3 ఏండ్ల నుంచి 10 ఏండ్ల వరకు ఉంటుంది. పొదుపుదారులు తమ ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
రూ. 610తో ఒక లక్ష సంపాదించడం ఎలా..?
పదేండ్ల కాలపరిమితితో కూడిన మీరు ఎంచుకున్నారంటే.. నెలకు రూ. 610 చొప్పున పొదుపు చేస్తే.. పదేండ్ల అనంతరం వడ్డీతో కలిపి రూ. 1 లక్ష వరకు కార్పస్ లభిస్తుంది. అంటే ఈ పథకంలో సొమ్మును డిపాజిట్ చేయాలనుకుంటే రోజుకు రూ. 20 పొదుపు చేయాలి. ఆ తర్వాత ఆరు అంకెల మొత్తాన్ని సాధించొచ్చు. కాబట్టి ఈ పథకం రోజువారీ కూలీలకు, ఉద్యోగులకు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది.
మరి వడ్డీ రేట్లు ఎలా..?
హర్ ఘర్ లఖ్‌పతి పథకం కింద సాధారణ పౌరులకు అయితే 3-4 ఏండ్ల కాలానికి గరిష్టంగా 6.55 శాతం, 5-10 ఏండ్ల కాలానికి అయితే 6.30 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3-4 ఏండ్ల కాలానికి గరిష్టంగా 7.05 శాతం, 5-10 ఏండ్ల కాలానికి 6.80 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఎస్బీఐ నిర్ణయాల ప్రకారం కాలానుగుణంగా మార్చవచ్చు అన్న విషయాన్ని గమనించాలి.
అర్హులు ఎవరు..?
హర్ ఘర్ లఖ్‌పతి పథకం కింద భారతీయ పౌరుడు ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా తెరవచ్చు. పిల్లలపై కూడా ఈ ఖాతాను తల్లిదండ్రులు తెరవచ్చు. 10 ఏండ్లకు పైబడిన పిల్లలు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో ఖాతాను కలిగి ఉండొచ్చు. 10 ఏండ్ల లోపు పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టబద్ద సంరక్షకులు ఇందులో పొదుపు చేయొచ్చు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా లక్షాధికారి అయిపోండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram