Commercial LPG cylinder price | భారీగా త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు.. నేటి నుంచే అమ‌ల్లోకి

Commercial LPG cylinder price | గ్యాస్ సిలిండ‌ర్( Gas Cylinder ) ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. దీంతో వినియోగ‌దారుల‌కు స్వ‌ల్పంగా ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది. వాణిజ్య అవ‌స‌రాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌లను త‌గ్గించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ప‌ని చేసే చ‌మురు కంపెనీలు( Oil companies ) ప్ర‌క‌టించాయి.

  • By: raj |    business |    Published on : Jul 01, 2025 8:12 AM IST
Commercial LPG cylinder price | భారీగా త‌గ్గిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు.. నేటి నుంచే అమ‌ల్లోకి

Commercial LPG cylinder price | గ్యాస్ సిలిండ‌ర్( Gas Cylinder ) ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. దీంతో వినియోగ‌దారుల‌కు స్వ‌ల్పంగా ఊర‌ట ల‌భించిన‌ట్లు అయింది. వాణిజ్య అవ‌స‌రాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండ‌ర్ ధ‌ర‌లను త‌గ్గించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలో ప‌ని చేసే చ‌మురు కంపెనీలు( Oil companies ) ప్ర‌క‌టించాయి. ఒక్కో సిలిండ‌ర్‌పై రూ. 58.50 పైస‌లు త‌గ్గిన‌ట్లు పేర్కొన్నాయి. ఈ త‌గ్గిన ధ‌ర‌లు జులై 1వ తేదీ తెల్ల‌వారుజాము నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇక గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి.

క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ రేట్ల‌ను( Commercial LPG cylinder price ) తగ్గించడం ఈ ఏడాదిలో ఇది ఐదోసారి. 2025 జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయలు, ఏప్రిల్ నెల‌లో రూ. 41 మేర క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ రేట్ల ధ‌ర‌లు త‌గ్గాయి. జూన్ 1వ తేదీన కూడా ఒక్కో సిలిండ‌ర్ మీద రూ. 24 త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. తాజాగా మ‌ళ్లీ సిలిండ‌ర్ ధ‌ర‌లు త‌గ్గ‌డంతో వినియోగ‌దారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఒక్కో సిలిండ‌ర్ మీద రూ. 58 త‌గ్గించారు.

తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,723 నుంచి రూ. 1,665లకు తగ్గింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 1,670 నుంచి రూ. 1,616.50 పైసలకు తగ్గింది. కోల్‌కతలో రూ.1,826 నుంచి 1,769 రూపాయల మేర తగ్గింది. చెన్నైలో నిన్నటివరకు రూ. 1,881 ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర.. ప్రస్తుతం నుంచి రూ. 1,822.50 పైసలు పలుకుతోంది.