Gold Price Today| బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. మంగళవారం ఏకంగా రూ.2080రూపాయలు పెరిగి..10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1, 32,770కి చేరింది.

Gold Price  Today| బిగ్ షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు

విధాత, హైదరాబాద్: దీపావళి సందర్బంగా బంగారం ప్రియుల(gold news)కు మరింత షాకింగ్ న్యూస్ ఎదురైంది. దీపావళి వేళ రెండు రోజుల పాటు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు(gold price hike) పండుగ ముగిసిన వెంటనే మంగళవారం మళ్లీ పెరిగాయి. ఏకంగా రూ.2080రూపాయలు పెరిగి..10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1, 32,770కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1,900 పెరిగి రూ.1, 21, 700 దగ్గర ట్రేడ్ అవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు జోరు చూస్తుంటే ఈ ఏడాది లక్షన్నర మార్క్ చేరడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్తా దిగివచ్చాయి. లో వెండిపై రూ.2,000 తగ్గింది. కిలో వెండి రూ.1, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 88, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 70, 000 దగ్గర అమ్ముడవుతోంది.