పెరిగిన బంగారం ధర..స్థిరంగా వెండి

శనివారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 760 పెరిగి రూ.1,43,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,31,350 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

దేశీయ మార్కెట్ లో మరోసారి బంగారం ధరలు పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్ లలో మార్పులు వంటి అంశాల బంగారం పెరుగుదలకు కారణాలుగా భావిస్తున్నారు.

శనివారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 760 పెరిగి రూ.1,43,290 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,31,350 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

కొంతకాలంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తిరిగి కోలుకునే స్పష్టమైన సంకేతాలను చూపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక సూచికలను పరిశీలిస్తే.. సమీప భవిష్యత్తులో ఈ విలువైన లోహాల ధరలు మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

Latest News