gold, silver prices| స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు..ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 1,48,900వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి రూ.2,59,900వద్ద కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు..ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 1,48,900వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.1,36,540వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.100 తగ్గి రూ.2,59,900వద్ద కొనసాగుతుంది.
అమెరికా – ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. దేశీయంగా పసిడి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. బంగారం ధరల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శనివారం కొంత బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మార్కెట్ తీవ్రమైన అస్థిరతకు లోనవుతోందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది పేర్కొన్నారు. ఈ అస్థిరతకు ప్రధాన కారణం కేవలం యుద్ధ వాతావరణమే కాకుండా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల్లో అనిశ్చితి కూడా ఒక ముఖ్య కారణంగా విశ్లేషిస్తున్నారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా మారినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ‘సురక్షిత పెట్టుబడిగా’ భావిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రేడింగ్‌లో ధరలు అనూహ్యంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే భవిష్యత్తులో అంతర్జాతీయంగా వచ్చే మార్పులుతో మళ్లి బంగారం, వెండి ధరలు పుంజుకోవచ్చంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram