Hyundai Creta | హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. రూ.58 వేలు పెట్టడం వల్ల లాభమేనా?

Hyundai Creta | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా ముందంజలో ఉంటుంది. కస్టమర్ల ఆకర్షణను కొనసాగించేందుకు హ్యుందాయ్ మోటార్స్ కొత్తగా క్రెటా సమ్మర్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Hyundai Creta | హ్యుందాయ్ క్రెటా నుంచి సమ్మర్ ఎడిషన్.. రూ.58 వేలు పెట్టడం వల్ల లాభమేనా?

Hyundai Creta | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా ముందంజలో ఉంటుంది. కస్టమర్ల ఆకర్షణను కొనసాగించేందుకు హ్యుందాయ్ మోటార్స్ కొత్తగా క్రెటా సమ్మర్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ ఎడిషన్ కోసం అదనంగా రూ.9 వేల నుంచి రూ.58 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో మరి ఆ డబ్బుకు తగిన విలువ ఉందా? లేదా? అన్నదానిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సమ్మ ర్ ఎడిషన్‌లో EX, EX(O), S(O), S(O) Knight, SX, SX Premium వంటి ఆరు వేరియంట్లు ఉన్నాయి. సాధారణ మోడళ్లతో పోలిస్తే రూ.9వేల నుంచి రూ.58 వేల వరకు అదనపు ధరతో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా రూ.12.06 లక్షల నుంచి రూ.17.89 లక్షల (ఎక్స్ షోరూం) ధర ఉంది.

అయితే ఈ అదనపు ధరకు హ్యుందాయ్ కంపెనీ కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను దిగువ వేరియంట్లకే అందిస్తుండటం గమనార్హం. EX వేరియంట్‌లో ఇప్పుడు కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్ వంటి ఫీచర్లు వచ్చాయి. EX(O) వేరియంట్‌లో ఫుల్ LED లైటింగ్, రేర్ కెమెరా, రేర్ విండో సన్‌షేడ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

S(O), SO) నైట్ వేరియంట్లలో డ్యాష్ క్యామ్ వంటి ఫీచర్లను జోడించారు. SX వేరియంట్‌లో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. SX ప్రీమియం వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు వంటి అధునాతన సదుపాయాలు చేర్చారు. గతంలో ఇవి టాప్ వేరియంట్‌లో మాత్రమే లభించేవి.

ఇక పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లు రెండూ ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగుతాయి. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. పవర, టార్క్, ట్రాన్స్‌మిషన్ ఎంపికలో కూడా మార్పులేమీ లేవు.

మొత్తంగా చూస్తే ఈ సమ్మర్ ఎడిషన్‌లో పెద్దగా మార్పులేమీ లేకపోయినా.. తక్కువ వేరియంట్లలోనే అదనపు ఫీచర్లను అందించడం అందర్నీ ఆకర్షిస్తున్నాయి. మిడ్ వేరియంట్లు కొనాలని అనుకునేవారికి ఈ ఎడిషన్ బెస్ట్ అని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. అయితే కేవలం ఇంజిన్ పనితీరు కోసం చూస్తున్నవారికి మాత్రం పెద్దగా తేడా అనిపించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Read More:

బీఎండబ్ల్యూ నుంచి కొత్ బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

విండోలు తెరిచి కారు నడిపితే మైలేజ్ తగ్గుతుందా? నిజం ఏమిటి?