Oben Electric | రూ.99,999కే ఓబెన్ రోర్ EVO.. 8 ఏళ్ల వారంటీ, 180 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. !

Oben Electric | భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్త ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'రోర్ EVO'ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్‌గా దీన్ని పరిచయం చేసింది.

Oben Electric | భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్త ఓబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘రోర్ EVO’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్‌గా దీన్ని పరిచయం చేసింది. అధిక పనితీరు, రోజువారీ వినియోగానికి సెట్ అయ్యేలా ఈ బైక్‌ను రూపొందించామని తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద తొలి 10 వేల మంది కస్టమర్లకు రూ.99,999 (ఎక్స్ షోరూం) ధరకే అందుబాటులో ఉంచింది. అనంతరం దీని ధర రూ.1,24,999కి పెరగనుంది.

ఆకట్టుకునే డిజైన్‌లో..

ఓబెన్ రోర్ Evo బైక్ చూడగానే ఆకట్టుకునే డిజైన్‌తో వస్తోంది. దీని ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ DLRతో కూడిన ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్ అమర్చారు. దీని ట్యాంక్ భాగాన్ని, బాడీ ప్యానెల్స్‌ను బోల్డ్ లుక్‌లో శిల్పకళాత్మకంగా రూపొందించారు. బలమైన స్టాన్స్, ప్రీమియం ఫినిషింగ్ ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.

సింగిల్ చార్జింగ్‌తో 180కి.మీ. ప్రయాణం

ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 110 కి.మీ.వేగంతో దూసుకెళ్తుంది. ఎకో మోడల్‌లో ఇది 60kmph వేగంతో వెళ్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 180కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం మూడు సెకన్లలోనే 0 నుంచి 40kmph వేగాన్ని అందుకోగలదు. ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కలదు. కేవలం 90 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది.

ఏఐ ఫీచర్లు

ఈ బైక్‌లో SmartIQ అనే AI ఆధారిత రైడ్ మోడ్‌ను అందించారు. ఇది బైకర్ రైడింగ్ స్టైల్‌ను విశ్లేషించి పవర్ డెలివరీని సర్దుబాటు చేస్తుంది. దీనివల్ల బైక్ రేంజ్ 15 శాతం వరకు పెరుగుతుందని ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది.

బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ

రోర్ Evo బైక్‌లో 3.4kWh సామర్థ్యంలో కూడిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు. ఇది సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 50 శాతం ఎక్కువ ఉష్ణ నిరోధకత, రెండింతల ఎక్కువ లైఫ్‌టైమ్ కలిగి ఉంటుంది. సాధారణ బ్యాటరీ వారంటీ మూడు సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్లుగానే ఉంటుంది. కానీ ఈ బైక్‌లోని బ్యాటరీకి 8 సంవత్సరాలు లేదా 80 వేల కిలోమీటర్ల వారంటీని అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఇది IP68 సర్టిఫికేషన్‌తో వస్తుంది.

ఫీచర్లు

కొత్త ఓబెన్ రోర్ Evo బైక్‌లో 8 అంగుళాల TFT కలర్ డిస్‌ప్లే వస్తుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్స్, మెసేజ్ అలర్ట్స్, రైడ్ డేటా వంటి సమాచారం కనిపిస్తుంది. అలాగే ఫాల్ అలర్ట్, ఎమర్జెన్సీ అసిస్ట్, యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే ఓబెన్ యాప్ ద్వారా రైడ్ హిస్టరీ, జియో ఫెన్సింగ్, రిమోట్ డయాగ్నస్టిక్స్, థెప్ట్ ప్రొటెక్షన్, Find My Rorr వంటి సదుపాయలు కూడా వస్తున్నాయి. ఇక ఓబెన్ కంపెనీకి దేశవ్యాప్తంగా 68 వేలకు పైగా చార్జింగ్ నెట్‌వర్క్ సపోర్టు కూడా ఉండటం గమనార్హం. ఈ బైక్‌లో 680మి.మీ. పొడవైన సీటు, 780 మి.మీ. సీట్ హైట్, 200 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌లు ఉన్నాయి. 10 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌తో పాటు డ్యూయల్ USB చార్జింగ్ పోర్టులను కూడా అందించారు.

ఈ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. పల్స్ రెడ్, న్యూట్రాన్ బ్లూ, మ్యాగ్నెటిక్ బ్లాక్, ఫొటాన్ వైట్ రంగుల్లో ఇది లభిస్తుంది. కేవలం రూ.777తో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 150 షోరూమ్‌ల్లో ఈ ఏడాది జూన్ నుంచి టెస్ట్ రైడ్స్, డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Read More:

రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!

350cc ఇంజిన్‌తో డ్యూక్ బైక్‌లు లాంఛ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Latest News