Royal Enfield EV bike |భారత మార్కెట్‌లో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల ఎన్‌ఫీల్డ్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. Flying Flea C6 మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. నియో రెట్రో డిజైన్‌‌కు ఆధునిక టెక్నాలజీని జోడించి నగర ప్రయాణాలకు అనువుగాబైక్‌ను రూపొందించారు.

ధర ఎంతంటే..

మోటార్ సైకిల్ ధరను రూ.2.79 లక్షలు ( చెన్నై ఎక్స్‌షోరూం)గా నిర్ణయించారు. అయితే Battery as a Service ప్లాన్‌తో కూడాబైక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇలా తీసుకుంటే రూ.1.99 లక్షలకే వచ్చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ ప్రత్యేకమైన ఫ్లయింగ్ ఫ్లీ స్టోర్ల ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

బైక్లాంచింగ్‌తో పాటు బెంగళూరులోని జయనగర్‌లో మొట్టమొదటి స్టోర్‌ను ఓపెన్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి టెస్ట్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బైక్ కావాలంటే కేవలం రూ.10వేలతోనే బుకింగ్ చేసుకోవచ్చు. మే నెల నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. విడతలవారీగా ఇతర నగరాల్లోనూమోటార్ సైకిల్ అమ్మకాలు జరగనున్నాయి.

స్టైలిష్ డిజైన్‌తో..

Flying Flea C6 బైక్‌ను ఆధునిక సాంకేతికతతో కూడిన వింటేజ్ డిజైన్ కలిగి ఉండేలా రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్రీ ప్రేరణతో దీన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మోటార్ సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Storm Black, Flea Green రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ రెట్రో లుక్‌కు దగ్గరగా ఉండి.. బైక్‌కు ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.

పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.91kWh లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. 15.kW పీక్ పవర్‌ను అందిస్తుంది అంటే 125-150సీసీ పెట్రోల్ బైక్‌కు సమానమైన పనితీరును అందించనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తు సుమారు 152 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతుంది. ఇక ఈ బ్యాటరీ 20 నుంచి 80 శాతం చార్జ్ కావడానికి సుమారు 65 నిమిషాలు పడుతుందని పేర్కొంది.

ఈ బైక్ పికప్ విషయానికి వస్తే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.7 సెకన్లలోనే చేరుతుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం 115 kmph అని పేర్కొంది. ఈ బైక్ లైట్ వెయిట్‌తో వస్తుంది. ఈ మోటార్ సైకిల్ కేవలం 124 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇది ఇప్పటివరకు వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల్లో అత్యల్ప బరువు కావడం గమనార్హం.

ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్‌లో 3.5 అంగుళాల రౌండ్ TFT టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లేను అమర్చారు. స్నాప్‌డ్రాగన్ ఆధారిత ఇంటర్‌ఫేస్‌తో ఇది స్మూత్‌గా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు నావిగేషన్, కాల్స్, మ్యూజిక్, వాయిస్ అసిస్టెంట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్‌లో వైరల్‌లెస్ ఫోన్ చార్జర్ కూడా అందించారు. 27W USB – C చార్జింగ్ పోర్టు కూడా ఉంది. ఈ బైక్లో ఎలక్ట్రానిక్ హ్యాండిల్ బార్ లాక్ కూడా ఉంది.

అలాగే డ్యూయల్ చానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, కీ లెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. Eco, Rain, Tour, Performance, Custom మోడ్‌లు ఉండటంతో అవసరానికి అనుగుణంగా రైడింగ్ అనుభవాన్ని మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో దీనికి డైరెక్ట్ కాంపిటీటర్స్ ఎవరూ లేకపోవడం గమనార్హం.

Read More:

BMW F 450 GS | బీఎండబ్ల్యూ నుంచి కొత్ బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Royal Enfiled Guerilla 450 | రాయల్ ఎన్‌ఫీల్డ్ సరికొత్త గెరిల్లా 450 బైక్‌ లాంచ్.. Apex వేరియంట్‌తో స్పోర్టీ స్టైల్!