Ola S1 X+ 5.2kWh | సింగిల్ చార్జింగ్‌తో 320 కి.మీ. వెళ్లొచ్చు.. ఓలా నుంచి మరో బైక్ రిలీజ్!

Ola S1 X+ 5.2kWh | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందంజలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తాజాగా మరో బైక్‌ను విడుదల చేసింది. 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWh స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.

Ola S1 X+ 5.2kWh | ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముందంజలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తాజాగా మరో బైక్‌ను విడుదల చేసింది. 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWh స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ప్రారంభ ధరగా రూ.1,29,999 (ఎక్స్ షోరూం)కు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ వేరియంట్‌లో 5.2kWh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ముఖ్యంగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చెందిన 4680 భారత్ సెల్‌ టెక్నాలజీని ఇందులో వినియోగించడం ప్రత్యేకంగా నిలిచింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ద్వారా భవిష్యత్‌లో మరిన్ని వాహనాల్లో కూడా ఈ టెక్నాలజీని విస్తరించాలని ఓలా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

పనితీరు విషయానికి వస్తే S1 X+ 5.2 kWh స్కూటర్ 11kW మిడ్ డ్రైవ్ మోటార్‌ను అమర్చారు. మోటార్ కంట్రోల్ యూనిట్‌తో కూడిన ఈ వ్యవస్థ, సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్‌గా చార్జి చేస్తే 320కి.మీ. రేంజ్‌ను అందిస్తుందని ఓలా కంపెనీ తెలిపింది. ఇక ఈ స్కూటర్ గరిష్ట వేగం 125kmph అని పేర్కొంది.

భద్రతాపరంగా ఈ స్కూటర్‌లో బ్రేక్-బై-వైర్ టెక్నాలజీతో పాటు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ను అమర్చడం వల్ల మెరుగైన కంట్రోల్, బ్రేకింగ్ పనితీరు లభిస్తుంది.

డిజైన్ పరంగా ఈ స్కూటర్‌ను ఐదు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జెట్ బ్లాక్, పోర్సలిన్ వైట్, ఇండస్ట్రియల్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, ఫ్యాషన్ రెడ్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఓలా రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ శ్రేణి 4.5kWh, 9.1kWh వంటి రెండు బ్యాటరీ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇక X మోడల్ వరుసగా 2.5kWh, 3.5kWh, 4.5kWh కాన్పిగరేషన్లలో అందుబాటులోకి వస్తుంది.

Read More:

Royal Enfield EV bike | ఆధునిక ఫీచర్లతో వింటేజ్ లుక్.. మార్కెట్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్!

Bajaj Pulsar Bike | అదే క్లాసిక్ డిజైన్.. కానీ అధునాతన ఫీచర్లు.. మార్కెట్‌లోకి బజాజ్ పల్సర్ 180 రీఎంట్రీ!

Latest News