PAN Card | ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
PAN Card | పాన్ కార్డు( PAN Card ) జారీ విషయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. శాశ్వత ఖాతా సంఖ్య PAN కార్డ్ దరఖాస్తులకు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది.
PAN Card | వేలు, లక్షల్లో లావాదేవీలు నిర్వహించే వారికి పాన్ కార్డు( PAN Card )తప్పనిసరి. అంతేకాదు.. ఇది ఒక గుర్తింపు కార్డు కింద కూడా పరిగణిస్తారు. భారతీయులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పాన్ కార్డు జారీ విషయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. శాశ్వత ఖాతా సంఖ్య PAN కార్డ్ దరఖాస్తులకు సంబంధించి కొన్ని సర్టిఫికెట్లను తప్పనిసరి చేసింది. ఈ విషయాన్ని CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ ద్వారా X(ట్విట్టర్)లో ఈ విషయాన్ని తెలియజేసింది.
పాన్ కార్డు జారీకి కొత్త నిబంధనలు ఇవే..
ఇప్పటి వరకు దరఖాస్తుదారులు పాన్ కార్డును పొందాలంటే ఆధార్ కార్డును ఉపయోగించేవారు. కానీ 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు పొందాలంటే ఆధార్‌తో పాటు మరిన్ని ధృవపత్రాలను తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారిత ప్రక్రియ ద్వారా సులభంగా పాన్ పొందడానికి ఇదే చివరి అవకాశం. కాబట్టి పాన్ కార్డు లేని వారు ఉంటే మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకోండి. ఆ తర్వాత ఆధార్‌తో పాటు, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త పాన్ కార్డుకు కావాల్సిన ధృవపత్రాలు ఇవే..
జనన ధృవీకరణ పత్రం (Birth Certificate),
ఓటర్ ఐడి,
పాస్‌పోర్ట్,
డ్రైవింగ్ లైసెన్స్,
మెట్రిక్ సర్టిఫికేట్ (SSC Memo),
ఇతర ప్రభుత్వ పత్రాలను సమర్పించాల్సి రావచ్చు.
ఆధార్ ప్రకారమే పేరు
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డులో పేరు ఆధార్ ప్రకారం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా..? లేదా..? అని నిర్ధారించుకోవాలి. ఒకవేళ పేరు తప్పుగా ఉంటే ఇప్పుడే సరి చేసుకోవడం ఉత్తమం.
రూ. 10 లక్షలు దాటితే పాన్ తప్పనిసరి..
తాజాగా ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పాన్ కార్డుకు సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో మీ బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, విత్ డ్రా చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంకులో అయినా లేదా వేర్వేరు బ్యాంకుల్లో అయినా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ.50 వేలు దాటితేనే పాన్ కార్డు అడుగుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram