ITR 2024 | ట్యాక్స్‌ రీఫండ్‌ వేగంగా రావాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

ITR 2024 | ITR 2024 ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ ITR దాఖలు చేయడానికి 2024 జులై 31 వరకు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ఉంది. ఈ గడువు దాటితే జరిమానాతో కలిపి రిటర్న్ ఫైల్ చేయడానికి 2024 డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ (FY24) లేదా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌ (AY25) కి సంబంధించి ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

  • By: Thyagi |    business |    Published on : Apr 25, 2024 11:17 AM IST
ITR 2024 | ట్యాక్స్‌ రీఫండ్‌ వేగంగా రావాలంటే ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

ITR 2024 : ITR 2024 ఫైలింగ్ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ ITR దాఖలు చేయడానికి 2024 జులై 31 వరకు (ఆలస్య రుసుము లేకుండా) గడువు ఉంది. ఈ గడువు దాటితే జరిమానాతో కలిపి రిటర్న్ ఫైల్ చేయడానికి 2024 డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ (FY24) లేదా 2024-25 అసెస్మెంట్ ఇయర్‌ (AY25) కి సంబంధించి ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.

ట్యాక్స్‌ రీఫండ్ విషయానికి వస్తే.. సాధారణంగా ఫామ్-16లో చూపిన దానికంటే ఎక్కువ పన్నును ఆదా చేయడం సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. సరైన అవగాహన ఉంటే ఫామ్-16లో కనిపించిన దాని కంటే ఎక్కువ ట్యాక్స్‌ను సేవ్ (Tax Saving) చేయవచ్చు. ఎక్కువ రీఫండ్ (Income Tax Refund) క్లెయిమ్ చేయడం కూడా సాధ్యమే.

టిప్స్..

సరైన పన్ను విధానం..

గరిష్ట ట్యాక్స్‌ రీఫండ్ పొందడానికి పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానాల్లో మీకు ఏ విధానం సరిపోతుందో సరిగ్గా గుర్తించాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ELSS), జీవిత బీమా పాలసీ (Life Insurance Policy) లాంటి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో మీరు పెట్టుబడి పెట్టకపోతే, హోమ్ లోన్ మీద వడ్డీ (Interest on Home Loan), హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) లాంటి పన్ను మినహాయింపులు (Tax Deductions) లేకపోతే.. కొత్త పన్ను విధానం (New Tax Regime) మీకు సరిపోతుంది. దీనిలో పన్ను తగ్గింపులు, మినహాయింపులు లాంటివి ఉండవు. స్లాబ్ వ్యవస్థ ప్రకారం పన్ను రేట్లు ఉంటాయి.

సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్‌..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువులోగా ట్యాక్స్‌ పేయర్ ITR ఫైల్ చేయాలి. ఆలస్యమైన/డేట్ మిస్ అయిన రిటర్న్స్‌కు సెక్షన్ 234F కింద లేట్ ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (taxable income) రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఆలస్య రుసుము రూ. 5,000 వరకు ఉంటుంది. ఈ ఫైన్ పడకుండా చూసుకుంటే మీరు గరిష్ట టాక్స్ రీఫండ్ తీసుకునే ఛాన్స్‌ ఉంది.

డేటాను సరిచూసుకోవడం..

ఫామ్-26AS, ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో (AIS) కనిపించే వివరాలను మీ వాస్తవ ఆదాయంతో సరిపోల్చుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే మీ కంపెనీ యాజమాన్యాన్ని, బ్యాంకులను సంప్రదించి సరిచేసుకోవాలి. దాంతో అనవసర భారం తగ్గి పన్ను ఆదా అవుతుంది.

నెలలోగా రిటర్న్స్ e-Verify..

ఇన్‌కం రిటర్న్స్‌ ఫైల్ చేసినంత మాత్రాన పని పూర్తికాదు. ఆదాయ పన్ను పత్రాన్ని సమర్పించిన తేదీ నుంచి ఒక నెలలోగా దానిని ఈ-వెరిఫై (e-Verify) చేయాలి. అంటే మీరు ఫైల్ చేసిన రిటర్న్స్‌ను ధృవీకరించాలి. ఈ-వెరిఫై తర్వాత మాత్రమే రిటర్న్ ప్రాసెస్/ఇన్‌కం టాక్స్ డిపార్టుమెంట్‌ పని ప్రారంభం అవుతుంది. మీరు మీ రిటర్న్స్‌ను ఎంత త్వరగా వెరిఫై చేస్తే రీఫండ్ అంత త్వరగా మీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది.

మినహాయింపులపై అవగాహన..

పన్ను విధించదగిన ఆదాయం నుంచి మీరు క్లెయిమ్ చేయగల డిడక్షన్స్‌ను, మినహాయింపులను సరిగ్గా పూర్తి అవగాహనతో లెక్కించాలి. లేదంటే బాగా అనుభవం ఉన్న వాళ్ల సాయం తీసుకోవాలి. దీనివల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. తద్వారా గరిష్ట రిఫండ్ తీసుకోవడం సాధ్యపడుతుంది.