gold, silver price today| నిలకడగా బంగారం, వెండి ధరలు
పది రోజులుగా భారీ హెచ్చు తగ్గుదలకు గురవుతున్న బంగారం, వెండి ధరలు ఆదివారం నిలకడగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,600వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : పది రోజులుగా భారీ హెచ్చు తగ్గుదలకు గురవుతున్న బంగారం, వెండి ధరలు ఆదివారం నిలకడగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,550వద్ద నిలిచింది. త్వరలో శుభకార్యాల సమయం కావడంతో ఇదే ధర వద్ద కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
స్థిరంగా వెండి ధర
గత కొన్ని రోజులుగా భారీ ధరల పతనాన్ని నమోదు చేసిన వెండి ధరలు కూడా ఆదివారం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది. జనవరి 29న కిలో వెండి ధర రూ. 4,25,000 ఆల్ టైమ్ రికార్డుతో గరిష్ట స్థాయిని తాకిన సిల్వర్ ఈటీఎఫ్ ధరలు.. ఒక్కసారిగా 38 శాతం మేర కుప్పకూలాయి.వెండి కొనుగోలుకు ఇదే మంచి చాన్స్ గా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు 2026 లో క్రమంగా 5 వేల డాలర్ల నుంచి 5,500 డాలర్ల వరకు ఔన్సుకు చేరవచ్చని సూచిస్తున్నారు. ధీర్ఘకాలంలో వెండి ధరలు కూడా మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram