TATA curvv car | త్వరలో రోడ్డు మీదికి టాటా కర్వ్‌ కారు.. దీని ప్రత్యేకతలు తెలుసా..!

TATA curvv car | ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (TATA motors) రెండేళ్ల క్రితం కాన్సెప్ట్‌ మోడల్‌గా తీసుకొచ్చిన టాటా కర్వ్‌ కారును ఇప్పుడు ఆవిష్కరించింది. ఈ కారు ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.

TATA curvv car | త్వరలో రోడ్డు మీదికి టాటా కర్వ్‌ కారు.. దీని ప్రత్యేకతలు తెలుసా..!

TATA curvv car : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (TATA motors) రెండేళ్ల క్రితం కాన్సెప్ట్‌ మోడల్‌గా తీసుకొచ్చిన టాటా కర్వ్‌ కారును ఇప్పుడు ఆవిష్కరించింది. ఈ కారు ఆగస్టు 7న ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది. 2022 ఏప్రిల్లో కాన్సెఫ్ట్ మోడల్‌గా కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డు మీదికి రాబోతున్నది.

కంపెనీ లాంచ్ చేయనున్న ఈ మిడ్ సైజ్ SUV.. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లాంచ్ అవుతున్నది. ఈ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫాసియా కొంతవరకు హారియర్, సఫారీ మాదిరిగా ఉంటుంది. రియర్ ప్రొఫైల్ కూడా చూడటానికి చక్కగా ఉంటుంది.

టాటా కర్వ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, టచ్ బేస్డ్ హెచ్‌వీ ఏసీ కంట్రోల్స్ వంటి ఫీచర్లను ఈ కారుతో పొందవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

టాటా కర్వ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ మోడల్ 450 కిలోమీటర్‌ల రేంజ్ అందించడానికి ఉపయోగపడే బ్యాటరీ ప్యాకును కలిగి ఉంటుందని సమాచారం.