SSMB29 : ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ఈవెంట్ పై రాజమౌళి కీలక సూచనలు

ఎస్ఎస్ఎంబీ 29 ఈవెంట్ పై రాజమౌళి కీలక సూచనలు. పాస్‌లున్న వారినే అనుమతిస్తారని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

Rajamouli

విధాత, హైదరాబాద్ : మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా Globe Trotter ఈవెంట్ ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈవెంట్ కు వచ్చే అభిమానులకు దర్శకుడు రాజమౌళి కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. పోలీసులు ఇచ్చిన సూచనలను ఆయన వివరించారు. పలు తొక్కిసలాటల అనుభవాల నేపథ్యంలో పోలీసులు చాల కచ్చితమైన ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈవెంట్ కు పాస్‌లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. ఈవెంట్‌కు అందరినీ అనుమతిస్తారంటూ సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. ఈ భారీ ఈవెంట్‌కు అందరూ సహకరించాలని కోరారు. జియోహాట్‌స్టార్‌లో లైవ్‌ చూడొచ్చని చెప్పారు. ఈవెంట్ కోసం రామోజీ ఫిలిం సిటీకి వచ్చే అభిమానులు రావాల్సిన రోడ్డు మార్గాలు, పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్ ను రాజమౌళి వివరించారు. మైనర్లకు, సీనియర్ సిటిజన్లకు ఈవెంట్ కు అనుమతి లేదన్నారు. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ రద్దు చేస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారని రాజమౌళి స్పష్టం చేశారు.