Chiranjeevi|ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్ చిరంజీవి.. పారిస్‌లో ఫ్యామిలీతో తెగ సంద‌డి చేస్తున్నారుగా..!

Chiranjeevi| టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేక గౌర‌వం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. ఎంతో మందికి ఆప‌ద‌లో అండ‌గా నిలుస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఇక ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక చిరు

  • By: sn    cinema    Jul 27, 2024 2:28 PM IST
Chiranjeevi|ఒలంపిక్ టార్చ్‌తో మెగాస్టార్ చిరంజీవి.. పారిస్‌లో ఫ్యామిలీతో తెగ సంద‌డి చేస్తున్నారుగా..!

Chiranjeevi| టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేక గౌర‌వం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు. ఎంతో మందికి ఆప‌ద‌లో అండ‌గా నిలుస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతున్నారు. ఇక ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక చిరు త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నారు. రీసెంట్ గా చిరంజీవి త‌న భార్య సురేఖ‌, కుమారుడు రామ్ చ‌ర‌ణ్‌, కోడ‌లు ఉపాస‌న‌, కూతురు క్లింకార‌తో క‌లిసి లండన్ ట్రిప్ కు వెళ్లారు. మొదటిసారి వరల్డ్ టూర్ కు వెళ్లిన క్లిన్ కారా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు చిరు, రామ్ చ‌ర‌ణ్‌.

అయితే లండ‌న్ పూర్తయ్యాక మెగా ఫ్యామిలీ లండన్ నుండి పారిస్ వెళ్లారు, అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ లో సందడి చేశారు. ఒలింపిక్స్ టార్చ్ లాంటిదే ఒకటి తయారుచేసి అది ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల కోసం పెట్ట‌గా, ఆ రెప్లికా ని పట్టుకొని, చిరంజీవి అతని భార్య సురేఖ పోజులు ఇచ్చారు. ఒలింపిక్స్ లో భారత దేశం తరఫును ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేసారు చిరంజీవి. సాధారణంగా ఒలంపిక్ టార్చ్ ని స్టార్ ఆటగాళ్లు, దేశ ప్రతినిధులు, అధికారులు, స్టార్ సెలబ్రిటీలు పట్టుకుంటారు. అయితే మెగాస్టార్ కూడా పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లడంతో అక్కడ ఇండియన్స్ ద్వారా ఆ ఒలంపిక్ టార్చ్ మన మెగాస్టార్ చేతిలోకి వ‌చ్చింది.

పారిస్ వీధుల్లో భార్య‌తో ఒలంపిక్ టార్చ్ ప‌ట్టుకొని చిరంజీవి ఇచ్చిన పోజులు ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటున్నాయి. ఒలంపిక్ టార్చ్ ని చిరంజీవి పట్టుకున్నాడంటే మాములు విషయం కాదని, పారిస్ లో కూడా మెగాస్టార్ రేంజ్ మాములుగా లేదుగా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దీనికి మల్లిడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తుండ‌గా, ఈ మూవీ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో సుమారు ఆరుగురు కథానాయికలు వున్నారు, అందులో ప్రధాన పాత్ర త్రిష పోహిస్తోంది. వీలైనంత తొంద‌రగా మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న చేస్తున్నారు.