INDW vs AUSW | హీలీ సెంచరీతో ఆసీస్ అద్భుత విజయం – విశాఖలో భారత్‌కి వరుసగా రెండో ఓటమి
మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో విశాఖ వేదికగా భారత్‌పై ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. హీలీ 142, పెర్రీ 47 నాటౌట్‌తో లక్ష్యఛేదనలో రికార్డు సాధించి, భారత్‌కు వరుసగా రెండో ఓటమిని ఖాయం చేసారు.

Healy, Perry seal all-time classic for Australia in Vizag thriller
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. కెప్టెన్ అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సులు) విధ్వంసక శతకంతో భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యఛేదనతో రికార్డు నెలకొల్పింది.
భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోరు చేసినా, ఆస్ట్రేలియా 49వ ఓవర్లోనే 331/7తో విజయాన్ని సాధించింది. చివర్లో ఎలీస్ పెర్రీ (47 నాటౌట్), కిమ్ గార్త్ (14 నాటౌట్) భాగస్వామ్యం కంగారూలకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.
హీలీ విధ్వంసం – పెర్రీ దూకుడు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను హీలీ, లిచ్‌ఫీల్డ్ (40)లు వేగంగా ప్రారంభించారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. తర్వాత బేత్ మూనీ (4), సదర్లాండ్ (0) త్వరగా ఔటైనా హీలీ మాత్రం పరుగుల వర్షం కురిపించింది. భారత బౌలర్లపై విరుచుకుపడిన ఆమె కేవలం 84 బంతుల్లో సెంచరీ సాధించి, మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది. మధ్యలో క్రమ్స్‌తో బాధపడిన పెర్రీ రిటైర్డ్ హర్ట్ అయినా, చివర్లో తిరిగి వచ్చి గెలుపు పూర్తి చేసింది. గార్డ్నర్ (45 కూడా సమర్థవంతంగా ఆడింది.
భారత బౌలర్లలో ఎన్. శ్రీ చరణి (3/41) అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించింది. దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీశారు. కానీ ఇతర బౌలర్లు భారీ పరుగులు ఇవ్వడంతో భారత్ మ్యాచ్ కోల్పోయింది.
మంధాన–ప్రతీకా జంట దంచికొట్టినా…
ఇంతకు ముందు బ్యాటింగ్‌లో భారత్ అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) తొలివికెట్‌కు 155 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. కానీ మధ్యలో జెమీమా రోడ్రిగ్స్ (33), రీచా ఘోష్ (32)లు కుదురుకోకపోవడంతో వేగంగా వికెట్లు కోల్పోయింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22) చిన్న ఇన్నింగ్స్‌లు ఆడారు. చివరి 30 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా బౌలర్ అన్నాబెల్ సదర్లాండ్ (5/40) పుట్టినరోజు సందర్భంగా అద్భుత బౌలింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను కుదిపేసింది.
ప్రపంచ రికార్డు ఛేదన
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల విజయఛేదన రికార్డు నమోదు చేసింది. మునుపటి రికార్డు శ్రీలంక పేరిట ఉండగా (302 పరుగులు, 2024లో ద.ఆఫ్రికాపై), ఇప్పుడు ఆసీస్ దాన్ని అధిగమించింది.
అలాగే ఈ మ్యాచ్‌లో 13 సిక్సులు నమోదయ్యాయి – మహిళల వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఇదే అత్యధికం.
Match Summary:
India: 330 all out (Mandhana 80, Rawal 75, Sutherland 5/40)
Australia: 331/7 (Healy 142, Perry 47*, Gardner 45, Charani 3/41)
Result: Australia won by 3 wickets.