Smriti Mandhana | ఆర్సీబీ విజ‌యం త‌ర్వాత స్మృతి త‌ల్లి ప‌లాష్‌పై సెటైర్స్.. ఆంటీ మీరు కెవ్వు కేక అంటున్న నెటిజ‌న్స్

Smriti Mandhana | మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది.

  • By: sn |    movies |    Published on : Feb 08, 2026 7:40 AM IST
Smriti Mandhana | ఆర్సీబీ విజ‌యం త‌ర్వాత స్మృతి త‌ల్లి ప‌లాష్‌పై సెటైర్స్.. ఆంటీ మీరు కెవ్వు కేక అంటున్న నెటిజ‌న్స్

Smriti Mandhana | మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండో ఏడాది ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయానికి కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాన కారణంగా నిలిచింది. ఆమె 41 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించింది.

ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ స్మృతి మంధాన తన అంకితభావాన్ని చాటింది. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ జట్టు కోసం మైదానంలోకి దిగిన ఆమె ప్రదర్శన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జార్జియా వోల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జార్జియా వోల్ 79 పరుగులతో రాణించగా, ఈ జోడీ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇన్నింగ్స్ డబ్ల్యూపీఎల్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మైదానంలో స్మృతి ప్రదర్శన ఎంత హాట్ టాపిక్‌గా మారిందో, మైదానం బయట కూడా అంతే చర్చ నడిచింది. గతంలో బాలీవుడ్ గాయకుడు పలాష్ ముచ్చల్‌తో స్మృతి నిశ్చితార్థం, తర్వాత పెళ్లి రద్దు కావడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సరదా మీమ్స్ షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ముఖ్యంగా స్మృతి తల్లి స్మితా మంధాన ఒక మీమ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తర్వాత ఆ పోస్ట్‌ను తొలగించినప్పటికీ అప్పటికే అది వైరల్ అయిపోయింది.

ఫైనల్‌లో స్మృతి ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే.. “స్మృతి బంతుల్లో తన మాజీ ప్రియుడి మొహాన్ని చూసుకుని కొడుతున్నట్లుంది” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. స్మృతి తల్లి స్మితా మంధాన స్వయంగా ఈ మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయ‌గా, దీనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. స్మృతి తల్లి సూప‌ర్ .. నిజమైన సావేజ్ ఆంటీ (ఆంటీ తోపు అన్న అర్థంలో)!” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. అయితే శనివారం (ఫిబ్రవరి 7) ఉదయానికి ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ కావడంతో స్మితా మంధాన దానిని తొలగించారు.

ఇదిలా ఉండగా స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ మధ్య ఆరేళ్లుగా కొనసాగిన బంధం 2025 చివర్లో ముగిసిన విషయం తెలిసిందే. పెళ్లి జరగాల్సిన సమయానికి అనూహ్యంగా అది రద్దు కావడంతో అప్పట్లో పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇరు కుటుంబాలు ఆరోగ్య కారణాల వల్లే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే, స్మృతి మంధాన మైదానంలో చూపిన ధైర్యం, నాయకత్వం ఆర్సీబీకి వరుస విజయాలను అందిస్తూ ఆమెను మరోసారి మహిళా క్రికెట్‌లో స్టార్‌గా నిలబెట్టాయి.