Smriti Mandhana | మ‌హిళా క్రికెట‌ర్స్ చేతిలో త‌న్నులు తిన్న‌ పలాష్ ముచ్చల్.. పెళ్లి రోజు వేరే అమ్మాయితో దొరికాడా?

Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో వీరి పెళ్లి ఆఖరి నిమిషంలో రద్దవడం అప్పట్లోనే అనేక ఊహాగానాలకు దారి తీసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి నటుడు, నిర్మాత విద్యాన్ మానే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త దుమారాన్ని రేపుతున్నాయి.

  • By: sn |    movies |    Published on : Jan 24, 2026 8:43 AM IST
Smriti Mandhana | మ‌హిళా క్రికెట‌ర్స్ చేతిలో త‌న్నులు తిన్న‌ పలాష్ ముచ్చల్.. పెళ్లి రోజు వేరే అమ్మాయితో దొరికాడా?

Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌వుమన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గతంలో వీరి పెళ్లి ఆఖరి నిమిషంలో రద్దవడం అప్పట్లోనే అనేక ఊహాగానాలకు దారి తీసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి నటుడు, నిర్మాత విద్యాన్ మానే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త దుమారాన్ని రేపుతున్నాయి.మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాన్ మానే, పెళ్లి ఏర్పాట్ల సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆ సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయని ఆరోపించాడు. పలాష్ ముచ్చల్ ప్రవర్తన కారణంగానే వివాహం ఆగిపోయిందని ఆయన వ్యాఖ్యానించాడు. అయితే ఇవన్నీ తన అభిప్రాయాలు, తనకు తెలిసిన విషయాలేనని మానే స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో నెటిజన్ల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి.

పలాష్ ముచ్చ‌ల్ పెళ్లి స‌మ‌యంలో మరొక అమ్మాయితో మంచం మీద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ దృశ్యం భ‌యానకంగా ఉంది. అప్పుడు భారత మహిళా క్రికెటర్లు అతన్ని కొట్టారు అంటూ ఆరోపించారు విద్యాన్ మానే. ఇదిలా ఉండగా, విద్యాన్ మానే మరో ఆరోపణ కూడా చేశాడు. పలాష్ ముచ్చల్ తన నుంచి సినిమా పెట్టుబడుల పేరుతో సుమారు రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడని పేర్కొంటూ ఈ విషయమై తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పెళ్లి రద్దైన తర్వాత ఆర్థిక లావాదేవీల అంశం కూడా బయటకు రావడంతో ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా చట్టపరమైన దిశగా మళ్లినట్లు కనిపిస్తోంది.

స్మృతి మంధాన–పలాష్ ముచ్చల్‌ల వివాహం 2025 నవంబర్ 23న జరగాల్సి ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న సమయంలో స్మృతి తండ్రి ఆరోగ్యం బాగోలేదని, అందుకే వేడుక వాయిదా పడిందని మొదట సమాచారం వెలువడింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ విషయంపై ఎలాంటి అప్‌డేట్లు రాకపోవడంతో అనుమానాలు పెరిగాయి. చివరికి పెళ్లి ఇక జరగదని అధికారికంగా ప్రకటించడంతో వారి సంబంధం ముగిసినట్లు స్పష్టమైంది. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌లు 2019 నుంచి దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారని అనేక నివేదికలు పేర్కొన్నాయి. ఈ సమయంలో ఇద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరిపై ఒకరు అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఫొటోలు, పోస్టులు షేర్ చేసేవారు. అందుకే వారి పెళ్లిపై అభిమానుల్లో పెద్ద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ అనుబంధం చివరకు వివాహం వరకు చేరకుండానే ముగిసిపోయింది.