Double Ismart | డబుల్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రివ్యూ.. రామ్ రచ్చతో బాక్సాఫీస్‌కి కర్మకాండే..!
Double Ismart| ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్.ఈ మూవీ గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా రూపొందుతుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో ప్ర

Double Ismart| ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్.ఈ మూవీ గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా రూపొందుతుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో ప్రమోషన్‌లో భాగంగా విశాఖపట్నంలో ట్రైలర్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఫస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ కు డబుల్ డోస్ అన్నట్టుగా ఉంది. రామ్ మరోసారి తన ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టగా, పూరీ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అన్ని మసాలా ఐటమ్స్ ఇందులో ఉన్నాయని ట్రైలర్‌ని బట్టి అర్ధమవుతుంది.
ట్రైలర్ మొదట్లో నేను ఎవరో తెలుసా? అని రామ్ అడిగితే.. తలకు యూఎస్‌బీ పోర్టు పెట్టుకొని తిరుగుతున్న ఒకే ఒక ఇడియెట్ అని సంజయ్ దత్‌కు హీరోయిన్ కావ్య థాపర్ చెప్పడం…. అప్పుడు రామ్.. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ అంటూ తన పరిచయం చేసుకోవడం మనం చూడవచ్చు. ఇక డబుల్ ఇస్మార్ట్ మన టార్గెట్ అంటూ సంజయ్ దత్ చెప్పడంతో కథపై కొంత ఆసక్తి జనాలలో కలిగింది. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది అంటూ చెప్పిన రామ్ మాస్ డైలాగ్స్, హీరో, హీరోయిన్స్ మధ్య ఘాటు రొమాన్స్ , యాక్షన్ సీన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ అన్ని కూడా సినిమాలో పుష్కలంగా ఉంటాయని ట్రైలర్‌ని బట్టి అర్ధమవుతుంది.
మీ వదినేమో కుతుబ్ మినార్.. నేనేమో చార్మినార్.. రెండు గుద్దుకొంటే ఎలా ఉంటుందంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. సంజయ్ దత్ జీవితాంతం అమరుడిగా ఉండేందుకు తన మెమోరీని ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడమనే పాయింట్‌తో ట్రైలర్‌లో అసలు కథ చెప్పాడు. ఇప్పుడు నా బ్రెయిన్ నీ బ్రెయిన్ లోకి వెళ్లబోతున్నది. ఇప్పుడు నీవు నాలా మారబోతున్నావు అని సంజయ్ దత్ కథలోని మెయిన్ పాయింట్‌ని రివీల్ చేశాడు. మళ్లీ వీడికే చిప్ పెట్టారా అంటూ షాయాజీ షిండే చెప్పే డైలాగ్ ను బట్టి పూరీ ఏం మారలేదు అనేది అర్థం చేసుకోవచ్చు. పూరీకి ఎప్పుడూ ఎసెట్ గా నిలిచే అలితో కూడా కాస్త స్పెషల్ ట్రాక్ నడిపాడు. అతనితో కాస్త ఫన్ జనరేట్ చేసే అవకాశం ఉంది.మొత్తానికి పూరీ, రామ్‌లు ఈ సినిమాతో మంచి హిట్ తమ ఖాతాలో వేసుకుంటారని అర్ధమవుతుంది. మిస్టర్ బచ్చన్‌తో డబుల్ ఇస్మార్ట్ శంకర్ పోటీకి దిగుతుండగా, పోటీ ఎలా ఉంటుందో చూడాలి.