BC Bandh| బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మంది అరెస్ట్

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలన్న డిమాండ్ తో బీసీ సంఘాలు శనివారం తలపెట్టిన బంద్ సందర్భంగా దాడులకు పాల్పడిన 8మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

BC Bandh| బీసీ బంద్‌లో దాడులకు పాల్పడిన 8 మంది అరెస్ట్

విధాత : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలన్న డిమాండ్ తో బీసీ సంఘాలు శనివారం తలపెట్టిన బంద్(BC Bandh) సందర్భంగా దాడులకు పాల్పడిన 8మందిపై(Arrested 8 Persons) పోలీసులు పలు సెక్షన్ల కిం కేసులు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో బీసీ బంద్ సందర్బంగా ఆందోళన కారులు పెట్రోల్ బంక్, షాపింగ్ మాల్స్, హోటల్స్ పై రాళ్లదాడికి పాల్పడటంతో పాటు ఫర్నిచర ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు.

బీసీ సంఘాలు తలపెట్టిన బీసీ బంద్ కు కేంద్ర రాష్ట్రాల్లోని అధికార బీజేపీ, కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, వామపక్షాలు, ఎంఐఎం, తెలంగాణ జాగృతి సహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది.