Faria Abdullah| జాతిర‌త్నాలు బ్యూటీ ఓంటి మీద అన్ని టాటూలున్నాయా.. వాటి అర్ధం ఏంటో తెలుసా?

Faria Abdullah|  జాత‌రత్నాలు సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి పొడుగు కాళ్ల సుంద‌రి ఫ‌రియా అబ్ధుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో అద‌ర‌గొట్టిన ఈ బ్యూటీ రీసెంట్‌గా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొ

  • By: sn    cinema    May 05, 2024 7:35 AM IST
Faria Abdullah| జాతిర‌త్నాలు బ్యూటీ ఓంటి మీద అన్ని టాటూలున్నాయా.. వాటి అర్ధం ఏంటో తెలుసా?

Faria Abdullah|  జాత‌రత్నాలు సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి పొడుగు కాళ్ల సుంద‌రి ఫ‌రియా అబ్ధుల్లా. మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో అద‌ర‌గొట్టిన ఈ బ్యూటీ రీసెంట్‌గా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మన ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది ఫ‌రియా. అయితే ఈ అమ్మ‌డు న‌టించిన జాతిర‌త్నాలు సినిమా అంత పెద్ద హిట్ అయిన ఎందుకో అవ‌కాశాలు పెద్ద‌గా ప‌ల‌కరించ‌లేదు. రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో క‌నిపించిన ఫరియా బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.ఇక రీసెంట్‌గా ఆ ఒక్క‌టి అడక్కు సినిమాతో ప‌ల‌క‌రించింది.

అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న ఫ‌రియా అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది. తాను ప్రేమ వివాహ‌మే చేసుకుంటాన‌ని కూడా పేర్కొంది. ప్ర‌స్తుతం కెరియ‌ర్‌పైనే పూర్తి దృష్టి ఉంద‌ని, పెళ్లి గురించి త‌ర్వాత ఆలోచిస్తాన‌ని పేర్కొంది. అయితే ఫ‌రియా అబ్ధుల్లా గురించి గ‌త రెండు మూడు రోజులుగా నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ఒంటిపై ఉన్న టాటూల గురించి చ‌ర్చ న‌డుస్తుంది. ఆ ఒక్క‌టి అడక్కు సినిమా ప్ర‌మోష‌న్‌లో ఫ‌రియా త‌న ఫింగర్ మీదున్న టాటూకి మీనింగ్ చెప్పింది. అది మోర్స్ కోడ్‌లో వేయించుకున్న టాటూ అని , దాని మీనింగ్ ఆర్ట్ అని తెలిపింది. తనకు ఆర్ట్ అంటే చిన్నతనం నుంచి ఇష్టం కాబ‌ట్టి ఆర్ట్ అని టాటూ వేయించుకుంద‌ట‌.

ఇక చేతి మీద విదేశీ భాష‌లో ఉన్న టాటూ అర్ధం… వచ్చాం.. చూశాం.. సాధించాం..అంటూ తెలియ‌జేసింది. ఇక కాలి మడమ వద్ద ఉన్న టాటూ మన రూట్స్‌ను తెలియజేస్తుందంటూ చాలా విపులంగా వివ‌రించింది. ఆమె ఆమె ఎద కింది భాగంలో కూడా ఒక సీక్రెట్ టాటూ వేయించుకున్నట్టుగా కనిపిస్తోంది. కాని ఆ టాటూ సీక్రెట్ అయితే రివీల్ చేయ‌లేదు. మొత్తానికి అయితే చిట్టి టాటూల గురించి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చ న‌డుస్తుంది.