Ramoji Rao | రామోజీరావుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అశ్రునివాళి.. నివాళులర్పించిన హీరో రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌

Ramoji Rao | ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు 'గేమ్ ఛేంజర్‌' సినిమా బృందం అశ్రునివాళి అర్పించింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో రామోజీరావు మరణవార్త తెలియడంతో ఆ సినిమా హీరో రామ్‌ చరణ్‌, దర్శకుడు శంకర్‌ మిగతా చిత్రబృందం అంతా నివాళులు అర్పించింది. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది.

  • By: Thyagi |    cinema |    Published on : Jun 08, 2024 11:01 AM IST
Ramoji Rao | రామోజీరావుకు ‘గేమ్‌ ఛేంజర్‌’ అశ్రునివాళి.. నివాళులర్పించిన హీరో రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌

Ramoji Rao : ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ‘గేమ్ ఛేంజర్‌’ సినిమా బృందం అశ్రునివాళి అర్పించింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో రామోజీరావు మరణవార్త తెలియడంతో ఆ సినిమా హీరో రామ్‌ చరణ్‌, దర్శకుడు శంకర్‌ మిగతా చిత్రబృందం అంతా నివాళులు అర్పించింది. ఆయన మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించింది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా యూనిట్‌ రామోజీరావుకు నివాళులు అర్పించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.

కాగా ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను రామోజీ ఫిలింసిటీలోని తన నివాసం నుంచి నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ప‌రిస్థితి విష‌మించ‌డంతో శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు క‌న్నుమూశారు.