Hema| బెంగళూరు రేవ్ పార్టీలో హేమ.. ఫోటో విడుదల చేసిన బెంగళూరు పోలీసులు
Hema| ఇటీవలి కాలంలో రేవ్ పార్టీలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూర్‌లో ఆదివారం జరిగిన ఓ రేవ్‌పార్టీ తెలుగు రాష్ట్రాలలో కూడా కలకలం రేపుతుంది. అందుకు కారణం ఆ పార్టీలలో తెలుగు టీవీ నటులతో పాటు మోడల్స్, వ్యాపారవేత్తలు ఉండడం. బడా

Hema| ఇటీవలి కాలంలో రేవ్ పార్టీలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూర్‌లో ఆదివారం జరిగిన ఓ రేవ్‌పార్టీ తెలుగు రాష్ట్రాలలో కూడా కలకలం రేపుతుంది. అందుకు కారణం ఆ పార్టీలలో తెలుగు టీవీ నటులతో పాటు మోడల్స్, వ్యాపారవేత్తలు ఉండడం. బడా వ్యాపారికి చెందిన బర్త్ డే పార్టీని రేవ్ పార్టీగా మార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌజ్‌పై దాడి చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు వందమందికిపైగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుపై పాస్ పోర్ట్ లభ్యమైనట్లు చెబుతుండగా, ఈ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉందని ప్రచారాలు సాగాయి.
ఈ క్రమంలో హేమ స్పందిస్తూ.. ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను. బెంగళూరు రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని చెప్పారు. తన గురించి కన్నడ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ హేమ తేల్చి చెప్పింది. కాకపోతే హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు ఫొటో బయటపెట్టారు. తాము అరెస్ట్ చేసిన వారిలో హేమ కూడా ఉందని బెంగళూరు పోలీసులు తెలియజేశారు.
అయితే ఫామ్ హౌజ్ వచ్చేసి హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ రేవ్ పార్టీ తెల్లవారుజాము 3 గంటల వరకు సాగగా, ఆ పార్టీలో డ్రగ్స్, మద్యం కూడా యధావిధిగా వాడేశారట. పోలీసులు దాడులలో అవన్నీ దొరికాయని అంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇప్పుడు బెంగళూరు రేవ్‌పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతుంది. రానున్న రోజులలో ఎవరెవరు ఈ పార్టీలో పాల్గొన్నారు, అసలు సూత్రధారి ఎవరు అనేది తెలియనుంది.