Vishnu Priya: విష్ణు ప్రియతో జేడి చక్రవర్తి పెళ్లా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ, జేడీ చక్రవర్తిల ఇష్యూ ఇటీవలి కాలంలో చాలా హైలైట్ అయింది.వారి ప్రేమ, పెళ్లి అంటూ నెట్టింట ఎన్నో ప్రచారాలు సాగాయి. వీళ్లిద్దరూ కలసి ‘దయా’ అనే వెబ్ సిరీస్ రీసెంట్‌గా విడుదల కాగా, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో వారిద్దరికి ఈ లవ్ మేటర్ గురించి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. విష్ణు ప్రియ ఓ సందర్భంలో తనకు జేడి చక్రవర్తి అంటే క్రష్ అని, ఆయన ఒప్పుకుంటే వివాహం కూడా చేసుకుంటాను […]

Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ, జేడీ చక్రవర్తిల ఇష్యూ ఇటీవలి కాలంలో చాలా హైలైట్ అయింది.వారి ప్రేమ, పెళ్లి అంటూ నెట్టింట ఎన్నో ప్రచారాలు సాగాయి. వీళ్లిద్దరూ కలసి ‘దయా’ అనే వెబ్ సిరీస్ రీసెంట్‌గా విడుదల కాగా, ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో వారిద్దరికి ఈ లవ్ మేటర్ గురించి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. విష్ణు ప్రియ ఓ సందర్భంలో తనకు జేడి చక్రవర్తి అంటే క్రష్ అని, ఆయన ఒప్పుకుంటే వివాహం కూడా చేసుకుంటాను అని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది.తాజాగా ఇదే అంశంపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ మీరు నాకు ఎవరితో నైన కూడా పెళ్లి చేయండి. పెళ్లి చేయడానికి ఒకవేళ ఫంక్షన్ హాల్ దొరకకపోతే నా స్టూడియోలోనే చేసిన పరవాలేదు అంటూ విష్ణు ప్రియాతో జెడి చక్రవర్తి పెళ్లి అంటూ వస్తున్నవార్తలపై ఈ విధంగా స్పందించారు జేడి.
తను నా సినిమాలు చూసి అలా అనుకుంది తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఇద్దరం మంచి స్నేహితులం అని పేర్కొన్నాడు జేడి.ఇక దయా వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో దర్శకుడు పవన్ సాదినేని కూడా యాంకర్ విష్ణు ప్రియ ముందే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అతని వ్యాఖ్యలకు పక్కనే ఉన్న జేడీ చక్రవర్తి కూడా నవ్వుకున్నాడు. విష్ణు ప్రియ మాట్లాడుతూ.. నేను ‘దయ’ సినిమాలో చేస్తున్నానంటే దర్శకుడు పవన్ సాదినేనితో తలనొప్పి.. కాస్త జాగ్రత్త అని మా మేనేజర్స్ చెప్పారు. కానీ దేవుడి ‘దయ’వల్ల.. తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు.. లక్కీగా మంచి టీంతో పనిచేయడానికి ‘దయ’ వెబ్ సిరీస్‌లో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది.. ఐ యామ్ సో లక్కీ’ అని చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ.
ఆమె ఎగ్జైట్‌మెంట్‌ని చూసి దర్శకుడు పవన్ సాదినేని అదిరిపోయే పంచ్ వేశాడు. ‘యాక్చ్యువల్‌గా ఆ క్యారెక్టర్‌కి యాక్టింగ్ రాకపోయినా పర్లేదు.. ఫిజిక్, హైట్ ఉంటే చాలు అని ఫీల్ అయ్యాను అని అన్నాడు. అంటే ఆయన ఇన్ డైరెక్ట్‌గా ఆమెకు యాక్టింగ్ రాదనే విషయాన్ని చెప్పకనే చెప్పేయడంతో.. అక్కడే ఉన్న జేడీ చక్రవర్తి, మరో హీరోయిన్ రమ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని తెగ నవ్వేసుకున్నారు. విష్ణుది చైల్డ్ మెంటాలిటీ అని, ఆమెకి మంచి హృదయం ఉంది.. నైస్ సోల్.. ఆమె ఏం చేసినా కూడా నాకు ఇబ్బందిగా ఉండదు.. ఎంజాయ్ చేస్తాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేడి