Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు!
జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ లో స్వల్ప గాయాలు, టీమ్ అభిమానులకు భరోసా—ఆరోగ్యంగా ఉన్నారు, వైద్యులు రెండు రోజుల విశ్రాంతి సూచించారు.

విధాత : యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ఓ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ఓ యాడ్ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలైనట్లుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలే అయ్యాయని ఆందోళన చెందాల్సిన పనిలేదని జూనియర్ ఎన్టీఆర్ టీమ్ పేర్కొంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని..అభిమానులు ఆందోళన చెందనవసరం లేదని తెలిపింది. వైద్యులు రెండు రోజుల పాటు ఎన్టీఆర్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మిస్తున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం జిమ్‌లో శిక్షణ తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం డిఫరెంట్ లుక్స్ లో కనిపించేందుకు మరింత మేకోవర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ కు స్వల్ప గాయాలయ్యాయి.