Nandamuri Suhasini : ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు
నందమూరి సుహాసిని: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు, కానీ ఇప్పటికి సినిమాల్లో బిజీ, సరైన సమయం వచ్చేలా చూడాలి.

హైదరాబాద్, ఆగస్ట్ 30(విధాత): జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తన సోదరి నందమూరి సుహాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తాడని, అయితే ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నారన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు జూనియర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని సుహాసినీ క్లారిటీ ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి తమ అభిమాన నటుడు ఎప్పుడు వస్తాడా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసిన సంఘటనలు చూశాం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీలో తానే కీలక నేతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా ఓ ఎమ్మెల్యే చేసిన వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సదరు ఎమ్మెల్యే ఇంటు ముందు ధర్నా కూడా చేశారు. అయితే ఈ సంఘటనపై ఎన్టీఆర్ సైతం స్పందిస్తూ.. ఇంట్లో ఆడవారిని పరుష పదజాలంతో తిట్టడం సరైన విధానం కాదని, ప్రాజా ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన ధోరణి కాదని ఖండించారు.