Site icon vidhaatha

Klin Kaara| క్లింకార ఫ‌స్ట్ బ‌ర్త్ డే..ఈ రోజు అయిన ఫేస్ రివీల్ చేస్తారా..!

Klin Kaara| టాలీవుడ్ క్యూట్ క‌పుల్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌లు దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత క్లింకార అనే చిన్నారికి జ‌న్మ‌నిచ్చారు. స‌రిగ్గా గ‌త ఏడాది జూన్ 20న క్లింకార రాక‌తో మెగా ఫ్యామిలీలో సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ఇక క్లింకార రాక త‌ర్వాత ఆ ఫ్యామిలీలో అన్ని శుభాలే జ‌రుగుతున్నాయి. క్లింకార భూమిమీదకు రావడానికి కొద్దిరోజులు ముందు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు రావ‌డం మ‌నం చూశాం. ఇక కొద్ది రోజుల‌కే ఆమె బాబాయ్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నాడు.

2023 నవంబరు ఒకటో తేదీన వీరి పెళ్లి ఇటలీలో వైభవోపేతంగా జరిగింది. మనవరాలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అంద‌జేసింది. ఇక ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల‌లో జనసేన పార్టీ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా మారింద‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ఈ రోజు క్లింకార ఫ‌స్ట్ బ‌ర్త్ డే కావ‌డంతో సోష‌ల్ మీడియాలో ఆమెకి తెగ విషెస్ తెలియ‌జేస్తున్నారు.

క్లింకార ఫ‌స్ట్ బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ.. ఇప్ప‌టికైన చిన్నారి ఫేస్ రివీల్ చేయండంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క్లింకార‌కి సంబంధించిన ఫోటోస్ షేర్ చేసిన కూడా ఎక్క‌డ ఫేస్ రివీల్ చేయ‌లేదు. ఈ రోజు ఫ‌స్ట్ బ‌ర్త్ డే కావ‌డంతో త‌ప్ప‌నిసరిగా ఫేస్ రివీల్ చేస్తార‌ని కొంత‌మంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ రోజు క్లింకార బ‌ర్త్ డే వేడుక‌లు ఓ రేంజ్‌లో జ‌ర‌ప‌బోతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. ఇక క్లింకార ఫ‌స్ట్ బర్త్ డే సంద‌ర్భంగా ఉపాస‌న ఓ ఎమోష‌న‌ల్ వీడియో షేర్ చేసింది. అందులో చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఇద్ద‌రు త‌మ అనుభ‌వాల‌ని వివ‌రించారు. ఉపాస‌న త‌న కూతురుకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌గా, చ‌ర‌ణ్‌.. పాప‌తో త‌న జ‌ర్నీ గుఇరించి వివ‌రించారు.

Exit mobile version